బిజీ బిజీ గా రకుల్.. 2022 లో 7 సినిమాలు..!

Rakul Preet Becomes Busy With Back To Back Movies,Telugu Filmnagar,Tollywood Movie Updates,Telugu Film News,Tollywood Movie,Tollywood Movie Latest Updates, Telugu Film News 2022,Rakul Preet,Rakul Preet Movie,Rakul Preet Telugu Movies,Rakul Preet latest Movies,Rakul Preet Movie Updates,Rakul Preet latest News, Rakul Preet Upcoming Movies,Rakul Preet Next Film Newws,Rakul Preet Back To Back Movies Signed,Rakul Preet Back to Back Movies,Rakul Preet To Act In & Movies, Rakul Preet Back to Back Movies In 2022,Rakul Preet Bollywood Movies,Rakul Preet 6 Hindi Movies Signed,Rakul Preet Acting In 6 Hindi Movies in 2022, Rakul Preet Hindi Movie Runway 34,Rakul Preet Hindi Movie Doctor G,Rakul Preet Hindi Movie Thank God,Rakul Preet Hindi Movie Chhatriwali, Rakul Preet Hindi Movie act withAmitabh Bachchan,Rakul Preet Hindi Movie with Ajay Devgn

“కెరటం” మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ “మూవీ తో గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్‌ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. మరోపక్క తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. మొత్తంగా అటు తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా కొత్త హీరోయిన్స్ వస్తున్న నేపథ్యంలో ఆ పోటీని తట్టుకొని అవకాశాలను అయితే దక్కించుకుంటూనే ఉంది. ప్రస్తుతం అయితే రకుల్ పలు సినిమాలతో బిజీగా ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్, హిందీలో పలు సినిమాలు చేస్తుంది. విశేషం ఏంటంటే ఈ ఒక్క 2022లోనే దాదాపు ఏడు సినిమాలు రిలీజ్ కు సిద్దం చేస్తుంది. అందులో మరీ ముఖ్యంగా ఆరు సినిమాలు హిందీ సినిమాలే కావడం ఇంకా విశేషం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన సినిమాల గురించి తెలియచేసింది. నేను నటించిన 7 సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి.. ఈ ఏడాది నాకు కలిసొస్తుందని అనుకుంటున్నా అంటూ తెలిపింది.

కాగా ఆయుష్మాన్ ఖురానా సరసన డాక్టర్ జీ, అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న రన్ వే-34, అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్రాల సరసన థ్యాంక్ గాడ్, ఛత్రీవాలీ, అటాక్‌ లతో పాటు ఒక టైటిల్ పెట్టని చిత్రంలోను ఆమె నటిస్తుంది. మరి వీటిలో ఎన్ని సినిమాలు రకుల్ కు మంచి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =