ఈమధ్య హీరోలు హీరోల్లాగ మాత్రమే కాదు కాస్త నెగిటివ్ షేడ్ లో చేయడానికి కూడా ఏ మాత్రం ఆలోచించట్లేదు. ఒక రకంగా కొంతమందికి ఆ రోల్స్ కూడా బాగానే కలిసొస్తున్నాయి. అందుకే అన్ని రకాల ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక దీనిలో భాగంగానే నాని మరోసారి నెగిటివ్ షేడ్ లో నటించనున్నట్టు తెలుస్తుంది. నాని నెగిటివ్ షేడ్ లో ఇప్పటికే జెంటిల్‌మన్, వి సినిమాల్లో నటించాడు. అంతేకాదు ఆ పాత్రల్లో నాని నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నాని రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘అంటే సుందరానికి’ సినిమాతో పాటు ‘దసరా’ సినిమా ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ‘దసరా’ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కూడా షూటింగ్ ను శరవేగంగా జరపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలోనే కనిపిస్తాడట. ప్రస్తుతం అయితే ఈవార్త జోరుగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో నాని సరసన కీర్తిసురేష్ మరోసారి హీరోయిన్ గా నటించనుంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: