
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 215


'మాన్‌స్టర్' ఫైనల్ షెడ్యూల్ లో మంచు లక్ష్మీ..!

బన్నీ-చరణ్ క్రేజ్ ను వాడుకుంటున్న బాలీవుడ్..!

రెగ్యులర్ షూటింగ్ లో "రావణాసుర"

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం

త్వరలో "రంగస్థలం" హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్

భారీ కలెక్షన్స్ తో "బంగార్రాజు "

ఎప్పటికీ మీరే ధ్రువ తార..!

"సలార్" లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్

18 సంవత్సరాల వైవాహిక బంధానికి తెర

కరోనా నుండి కోలుకున్న 'మహానటి'

"అరుంధతి"లో జేజమ్మ పాత్ర పై అనుష్క స్పందన

'స్వాతిముత్యం' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

13 వసంతాల "అరుంధతి "

"పుష్ప :ది రైజ్"మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు

మరో వెబ్ సిరీస్ లో సమంత ?

'బంగార్రాజు' డైరెక్టర్ కు బంపరాఫర్

హ్యాట్రిక్ మూవీ తో గోల్డెన్ లెగ్ గా కృతిశెట్టి

జాయ్ ఫుల్ మూడ్ లో అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా “పుష్ప: ది రైజ్” మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

'మాన్‌స్టర్' ఫైనల్ షెడ్యూల్ లో మంచు లక్ష్మీ..!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. బుల్లి తెరపై వ్యాఖ్యతగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ ఆతరువాత వెండి తెర ప్రవేశం కూడా చేసింది. కానీ సినిమాల పరంగా మాత్రం మంచు లక్ష్మీ పెద్దగా సక్సెస్ అవ్వలేదనే చెప్పొచ్చు. అయితే అప్పుడప్పుడు సినిమాలను చేస్తూ సందడి చేస్తుంది. అంతేకాదు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక రీసెంట్ గానే మంచు లక్ష్మీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే కరోనా నుంచి కోలుకుంది.

బన్నీ-చరణ్ క్రేజ్ ను వాడుకుంటున్న బాలీవుడ్..!
మొత్తానికి సౌత్ సినిమాల హవా ఇప్పుడు నార్త్ లో బాగానే సాగుతుంది. నాలుగైదేళ్ల క్రితం మనవాళ్లు నార్త్ సినిమాలను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల రేంజ్ ఎలా మారిందో చూశాం. విభిన్నమైన కథలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అంతేకాదు కొత్త కొత్త డైరెక్టర్లు, కొత్త సినిమాలతో ఇలా టాలీవుడ్ మార్కెట్ స్థాయి పూర్తిగా మారిపోయాయి. అంతేనా కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇన్ని సినిమాలు రిలీజ్ చేసిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. మంచి సక్సెస్ రేటును అందుకున్న ఇండస్ట్రీ కూడా టాలీవుడ్ మాత్రమే. ఇప్పటికే బాహుబలి, సాహో సినిమాలు నార్త్ లో…

రెగ్యులర్ షూటింగ్ లో "రావణాసుర"
అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 14న లాంచనంగా ప్రారంభం అయ్యింది. రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ది రైజ్” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికే ఈ చిత్రం పై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

త్వరలో "రంగస్థలం" హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో 200 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు , పల్లెటూరి యువతి రామలక్ష్మి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా "రంగస్థలం " మూవీ ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు.

భారీ కలెక్షన్స్ తో "బంగార్రాజు "
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటించారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

ఎప్పటికీ మీరే ధ్రువ తార..!
తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన వారిలో ఎంతోమంది ఉండగా అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి. తెలుగు సినీ చరిత్రలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు అనేకం. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు... యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది…

"సలార్" లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. జగపతి బాబు , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

18 సంవత్సరాల వైవాహిక బంధానికి తెర
తమిళ దర్శకుడు కస్తూరి రాజా తనయుడు , దర్శకుడు సెల్వ రాఘవన్ సోదరుడు , తలైవా రజినీకాంత్ అల్లుడు ధనుష్ పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను , తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో స్ట్రయిట్ తెలుగు మూవీస్ తో ధనుష్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. 2004 సంవత్సరం నవంబర్ 18 వ తేదీ ధనుష్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ ఐశ్వర్య తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.

కరోనా నుండి కోలుకున్న 'మహానటి'
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. గత రెండు వారాల్లోనే ఎంతోమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇక దీనిలో భాగంగానే సర్కారు వారి పాట టీమ్ లో ముగ్గురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ముందు సూపర్ స్టార్ మహేష్ తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని తెలుపగా.. ఆ తర్వాత థమన్ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. వారిద్దరి తర్వాత కీర్తి సురేష్ కూడా రీసెంట్ గానే తనకు కూడా కరోనా నిర్థారణ అయిందని తెలిపింది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. కానీ కరోనా పాజిటివ్ అని వచ్చిందని.. జాగ్రత్తగా ఉండండి..అందరూ వ్యాక్సిన్లు…

"అరుంధతి"లో జేజమ్మ పాత్ర పై అనుష్క స్పందన
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ "అరుంధతి " మూవీ 13 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అనుష్క సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆ మూవీ లో జేజమ్మ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అనుష్కను లేడీ సూపర్ స్టార్‌ని చేసిన ఈ చిత్రం ఆమెకే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది.

'స్వాతిముత్యం' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఈసినిమా చాలా లేట్ అయింది. అయితే ఈమధ్యే మళ్లీ ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

'అల వైకుంఠపురములో' మళ్లీ థియేటర్లలో.. హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఇక థమన్ సంగీతం అందించగా పాటలు ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాయో కూడా చూశాం.

13 వసంతాల "అరుంధతి "
మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ "అరుంధతి "మూవీ 2009 జనవరి 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అరుంధతి ,జేజమ్మ గా ద్విపాత్రాభినయం చేసిన హీరోయిన్ అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విలన్ గా సోనూసూద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా "అరుంధతి "మూవీ ని దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు.

"పుష్ప :ది రైజ్"మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 300కోట్ల క్లబ్ లో చేరింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన సాంగ్స్ కు…

రామ్ 'ది వారియర్' ఫస్ట్ లుక్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే ఇటీవలే తగిలిన గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో కోలుకొని మళ్ళీ షూటింగ్ మొదలుపెడుతున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటివరకూ 'RAPO19' అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. 'ది వారియర్' అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. రామ్ పోతినేని పోలీస్ పాత్రలో ఉన్న లుక్ రివీల్ చేశారు. మొదటి సారి ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ పాత్రలో…

మరో వెబ్ సిరీస్ లో సమంత ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ),, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'బంగార్రాజు' డైరెక్టర్ కు బంపరాఫర్
ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఇక పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ క్యూ కట్టేశాయి. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే అవి కాకుండా కాస్త పెద్ద సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే అది బంగార్రాజు సినిమా అని చెప్పొచ్చు. ఇక ఆసినిమా కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈసినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన సినిమా హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ ను తీశారు.. ఇప్పుడు ఈసీక్వెల్ కూడా హిట్ అయింది. దీంతో మేకర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

హ్యాట్రిక్ మూవీ తో గోల్డెన్ లెగ్ గా కృతిశెట్టి
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం "ది వారియర్ ", “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.