నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్..!

Rowdy Boys Hero Ashish Reddy Thanks Audience For Accepting Him,Telugu Filmnagar,Tollywood Movie Updates,Telugu Film News,Tollywood Movie,Tollywood Movie Latest Updates,Telugu Film News 2022, Rowdy Boys Hero Ashish Reddy,Rowdy Boys Hero Ashish Reddy Thanks Audience,Ashish Rowdy Boys Movie,Rowdy Boys Film,Ashish Rowdy Boys Telugu Movie, Devi Sri Prasad,Anupama Parameswaran Rowdy Boys,Ashish And Anupama Parameswaran Movie, Ashish Gandhi,Ashish Reddy Thnaks Audience,Hero Ashish Reddy Thanks Audience,Ashish New Movie,Ashish Rowdy Boys,Ashish Rowdy Boys Movie Update,Rowdy Boys Film, #ROWDYBOYS

కొత్త ఏడాది కొత్త హీరోలకు మాత్రం బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆసినిమాల్లో వచ్చిన ఒక సినిమానే రౌడీ బాయ్స్. ఈసినిమాతోనే ఆశిష్ రెడ్డి తెలుగు తెరకు పరిచయమయ్యాడు. దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉండగా.. ఆ అంచనాలను ఆశిష్ రెడ్డి నిలబెట్టాడనే చెప్పొచ్చు. మొదటి సినిమా అయినా కూడా తన నటనతో, డాన్స్ తో, యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఆశిష్ కు ఉన్నాయన్న ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ సినిమా సక్సెస్ సాధించినందుకు హ్యాపీగా ఉన్నారు. అయితే తన సినిమాను, తనను ఆదరించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాడు ఆశిష్ రెడ్డి. నిజానికి దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వస్తున్న సినిమా అంటే అందరికీ నమ్మకం ఉంటుంది.. అందుకే వాళ్ల పేరు మాత్రం చెడగొట్టకూడదు అని అనుకున్నా.. అందుకే ఈసినిమా కోసం చాలా కష్టపడ్డాను.. ఇన్నాళ్లు కష్టపడింది ఈ రోజు కోసమే. ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్‌ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందు సినిమాను బాబాయే చూశారు.. అప్పుడే సినిమా బాగుంది అన్నారు.. కానీ అప్పుడు నాకోసం అలా చెప్పారేమో అనుకున్నాను కానీ.. ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ ను చూసి చాలా ఆనందంగా ఉంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

కాాగా శ్రీ హర్ష దర్శకత్వంలో అశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా రౌడీ బాయ్స్. ఇంకా ఈసినిమాలో సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్, అయ్యంగార్, జయప్రకాష్ తదితరులు నటించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ స్వయంగా నిర్మించిన ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 9 =