
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 213


హీరో అజిత్ కు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం

వరుస అవకాశాలతో టాలీవుడ్ లో బిజీగా 'జయమ్మ'

స్విట్జర్లాండ్‌లో సమంత స్కీయింగ్

'అఖండ' ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోలేదు...!

సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ రీఎంట్రీ

'పెళ్లి చూపులు' డైరెక్టర్ కు కరోనా

మీరే నిజమైన రాజు..!

"హరిహర వీరమల్లు " కై మరో భారీ సెట్

'దుల్కర్ సల్మాన్' కు కరోనా పాజిటివ్..!

మీ ప్రేమకు, సపోర్ట్ కు థ్యాంక్స్..!

'శ్యామ్' ను మెచ్చిన చిరు..!

సందీప్ సినిమాలో 'జయమ్మ'

అనుపమ లేటెస్ట్ ఫొటో

సితార లేటెస్ట్ డ్యాన్స్ వీడియో

ఏపీ ముఖ్యమంత్రికి కైకాల సత్యనారాయణ థ్యాంక్స్..!

ప్రభాస్ వారియర్.. రాజమౌళి క్రియేటర్

విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ సినిమా క్యాన్సిల్..?

నిత్యా మీనన్ మనసులో మాట
మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యామీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. "ఆకాశగోపురం " తో మలయాళ , "అలామొదలైంది "తో తెలుగు , "నూటరెంబదు "తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. " 7 O' Clock"మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యామీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , "మిషన్ మంగళ్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

హీరో అజిత్ కు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం
కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న అజిత్ కుమార్ ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అజిత్ హీరోగా తెరకెక్కిన "వాలిమై"మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మాతగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "#AK61" మూవీ కి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "నెర్కొండ పార్వై", "వాలిమై" మూవీస్ తరువాత వీరి ముగ్గురి కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది.

వరుస అవకాశాలతో టాలీవుడ్ లో బిజీగా 'జయమ్మ'
తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు క్రాక్ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చేసిన జయమ్మ పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టడమే కాదు ఇప్పటికే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నాంది సినిమా లో కూడా లాయర్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో బిజీ బిజీ అవుతుంది. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ వెళుతుంది. పెద్ద పెద్ద సినిమాలో కీలక పాత్రలను సైతం దక్కించుకుంటుంది. మేకర్స్ కూాడా వరలక్ష్మీ కి మంచి పాత్రలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారు.

స్విట్జర్లాండ్‌లో సమంత స్కీయింగ్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ), ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రాజ్ అండ్ డీకేల దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్” ఫ‍్యామిలీ మ్యాన్ 2 ” వెబ్ సిరీస్ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి…

నాగచైతన్య చెప్పిన విడాకుల వార్త కు నాగార్జున స్పందన
ఫస్ట్ టైమ్ నాగచైతన్య , సమంత జంటగా నటించిన "ఏ మాయచేసావె" మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత కొన్ని సినిమాలలో జంటగా నటించిన నాగచైతన్య , సమంత లు రిలేషన్ షిప్ లో ఉండి 2017 లో వివాహం చేసుకున్నారు. 2021 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ వారి కెరీర్ లలో బిజీగా ఉన్నారు.

'అఖండ' ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోలేదు...!
ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో వారం రోజులు ఆడటమే ఎక్కువ అయిపోయింది. సూపర్ హిట్ సినిమాలే రెండు మూడు వారాల్లో వెళ్లిపోతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఒక సినిమా 50 రోజులు ఆడటం అంటే మాములు విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఘనతను నందమూరి బాలకృష్ణ సాధించారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ’మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూశాం. ఈసినిమాతో ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడుతుంది.

సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ రీఎంట్రీ
2001 సంవత్సరంలో "సూత్రధారణ్ ", "రన్" మూవీస్ తో మీరా జాస్మిన్ మలయాళ , తమిళ చిత్ర పరిశ్రమలకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. పలు మలయాళ , తమిళ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మీరా 2004 సంవత్సరం లో "అమ్మాయి బాగుంది "మూవీతో టాలీవుడ్ , "మౌర్య "మూవీ తో శాండల్ వుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. "గుడుంబా శంకర్", "భద్ర" , "పందెం కోడి", " గోరింటాకు" వంటి మూవీస్ తో మీరా ప్రేక్షకులను అలరించారు.

'పెళ్లి చూపులు' డైరెక్టర్ కు కరోనా
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం రోజు రోజుకు ఎంత విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళం నుండి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. అంతేకాదు రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నాం అని తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. ఈరోజు మరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తనకు కూడా కరోనా వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలియచేశాడు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు తరుణ్ భాస్కర్. హలో ఫ్రెండ్స్ నాకు కోవిడ్ వచ్చింది. రెస్ట్ తీసుకుంటున్నాను. కోవిడ్ ని సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్ అని అంటూ పోస్ట్ చేశాడు.

మీరే నిజమైన రాజు..!
కొంత మంది తెలిసేలా సేవా కార్యక్రమాలు చేస్తే.. కొంత మంది తెలియకుండా సేవా కార్యక్రమాలు చేసే వాళ్లు ఉంటారు. అలా బయటకు చెప్పుకోకుండా సేవ చేసే.. సాయం అందించే సినీ సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఎవరో ఒకరి ద్వారానో లేక సాయం పొందిన వారు చెబితే తప్పా బయటకు రాని ఘటనలు చాలానే ఉంటాయి. ఇక అలా సాయం చేసినా బయటకు చెప్పుకోని వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడడు. ఇప్పటికే మహేష్ బాబు చిన్న పిల్లలకు పలు సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు.. పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు.

"హరిహర వీరమల్లు " కై మరో భారీ సెట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'దుల్కర్ సల్మాన్' కు కరోనా పాజిటివ్..!
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమపై దీని ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కోరనా బారిన పడ్డారు. ఆ లిస్ట్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి ఉన్నారు. తనకు కరోనా సోకినట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని.. స్వల్ప జ్వరం మినహాయిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. ఇంటిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నా అంటూ తెలిపాడు.

మీ ప్రేమకు, సపోర్ట్ కు థ్యాంక్స్..!
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. ఫైనల్ గా మార్చి 18 హోలీ రోజున ఈసినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, పోస్టర్లు, టీజర్లు రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి.

'శ్యామ్' ను మెచ్చిన చిరు..!
నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాని సరసన కృతిశెట్టి, సాయిపల్లవి జంటగా నటించారు. రెండు విభిన్నమైన పాత్రలలో నాని , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈసినిమాను చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రేపటి నుంచే అంటే జనవరి21 నుండే ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

సందీప్ సినిమాలో 'జయమ్మ'
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ హీరో ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ అయిన మైఖేల్ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకోగా.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.

అనుపమ లేటెస్ట్ ఫొటో
సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ కథానాయికగా రూపొందిన “రౌడీ బాయ్స్ ‘మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్అయ్యింది. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

"పుష్ప"మూవీ పోస్టర్ తో కేంద్ర ప్రభుత్వం ప్రచారం
నార్త్ లేదు సౌత్ లేదు అన్నట్లుగా “పుష్ప “మూవీ హవానడుస్తుంది. ” పుష్ప” మూవీ పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు దృష్టి పెట్టి ,ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమంపై కార్యక్రమం చేపట్టారు. “పుష్ప” సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్ హెల్మెట్ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసి హెల్మెట్ తప్పని సరి.. తగ్గేదే లే అంటూ రాసి ఉన్న ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేసి హెల్మెట్ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. అంటూ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

సితార లేటెస్ట్ డ్యాన్స్ వీడియో
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార చిన్నప్పటి నుండీ చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సితార తన ఫొటోస్, డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సితార ఇప్పుడు స్వంతంగా యూట్యూబ్ ఛానెల్ ను మెయిన్ టైన్ చేస్తుండడం విశేషం. 522 K ఫాలోవర్స్ తో సితార ఇన్ స్టా గ్రామ్ లో దూసుకుపోతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రికి కైకాల సత్యనారాయణ థ్యాంక్స్..!
ఏపీ ముఖ్య మంత్రి జగన్‌కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత నవంబర్ నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కైకాల సత్యనారాయణ. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అయితే కైకాల సత్యనారాయణ కోలుకున్నారు. ఈనేపథ్యంలో ఆయన జగన్ కు లేఖ రాశారు.

ప్రభాస్ వారియర్.. రాజమౌళి క్రియేటర్
ప్రభాస్ వారియర్ అలానే రాజమౌళి క్రియేటర్ అని అంటున్నారు కింగ్ నాగార్జున. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున-నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బంగార్రాజు. ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాగా.. పలు సినిమాలు సంక్రాంతికి బక్సాఫీస్ వద్ద బరిలో దిగినా కూడా వాటన్నింటికీ పోటీ ఇస్తూ ఈ సినిమా పొంగల్ విన్నర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగానే నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున పలు హీరోల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ వారియర్ అని రాజమౌళి…

విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ సినిమా క్యాన్సిల్..?
టాలీవుడ్ లో రోజు రోజుకు కొత్త టాలెంట్ పెరిగిపోతుంది. ఎంతో మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. కానీ ఎంత మంది వచ్చినా కూడా కొంతమంది మార్క్ మాత్రం గుర్తుండిపోతుంది. అలా వచ్చి ఇప్పుడు నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోనే విజయ్ దేవరకొండ. ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే రౌడీ హీరో. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరగగా.. ఆ తరువాత కూడా వరుసగా హిట్స్ కొట్టడంతో స్టార్ రేంజ్ కు ఎదగడమే కాదు.. తన రేంజ్ ను మార్చేశాడు. ఇక స్టార్ డైరెక్టర్స్ సైతం తనతో సినిమా తీయాలన్న ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగలిగాడు. ప్రస్తుతం అయితే పూరీ డైరెక్షన్ లో లైగర్ సినిమా…