ఈ ఏడాది మంచి హిట్ తో తన ఖాతాను తెరిచాడు కింగ్ నాగార్జున. నిజానికి నాగార్జునకు కూడా మంచి హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. సోగ్గాడే చిన్న నాయన సినిమా తరువాత ఆ రేంజ్ లో హిట్ కొట్టిన సినిమా మరొకటి లేదు. ఇక చాలా గ్యాప్ తరువాత అదే సినిమాను సీక్వెల్ తీసి బంగార్రాజుతో సూపర్ హిట్ ను కొట్టారు. ఇప్పటివరకూ బంగార్రాజుతో బిజీగా ఉన్న నాగ్ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే నాగ్ హిందిలో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా సమాచారం కాజల్ ప్లేస్ లో సోనాల్ చౌహన్ రీ ప్లేస్ చేసినట్టు తెలుస్తుంది. కాజల్ వ్యక్తిగత కారణాల వలన ఈ సినిమా చేయలేకపోతుండటంతో సోనాల్ ను తీసుకున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: