ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి. పెద్ద సినిమాలన్నీ పోటీ నుండి తప్పుకోవడంతో అనుకోకుండా చాలా సినిమాలు తెరపైకి వచ్చాయి. ఇక వీటి మధ్యలో విడుదలైంది బంగార్రాజు. తమ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పి మరీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు కింగ్ నాగార్జున. ఇక నాగార్జున పెట్టుకున్న నమ్మకమే నిజం చేశారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుతం మళ్లీ కరోనా థర్డ్ వేవ్ ప్రభావం చాలా పెరిగిపోయింది.. ఇప్పటికే నార్త్ లో సినిమా రిలీజ్ లు చాలా వరకూ ఆగిపోయాయి.. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా చూడటానికి ఎవరు వస్తారు అనుకున్నారు.. కానీ మన తెలుగు సినీ లవర్స్ కు మాత్రం సంక్రాంతికి సినిమాలు కోరుకుంటారు.. అందుకే మా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేశాము.. వారే మా సినిమాను ఇంత బ్లాక్ బస్టర్ చేశారు.. వారికి నా సెల్యూట్.. ప్రతి ఒక్కరూ నాకు స్క్రిప్ట్ పై నమ్మకం ఉంది అందుకే ఇంత హిట్ అయింది అనుకుంటున్నారు.. కానీ నేను నమ్మింది మాత్రం తెలుగు ఆడియన్స్ ను.. సినిమాలు లేకపోతే సంక్రాంతి లేదు.. నేను కలెక్షన్స్ గురించి మాట్లాడట్లేదు.. మీ ప్రేమ ముందు కలెక్షన్స్ నథింగ్ అని అన్నారు. ఇంకా మేము బంగార్రాజు కాదు.. అసలైన బంగార్రాజు మా నాన్నగారు అంటూ చమత్కరించారు.
కాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కించాడు కళ్యాణ్ కృష్ణ. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: