తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వాలని.. స్టార్ హీరోగా ఎదగాలని ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే వారిలో కొంతమంది సక్సెస్ అవుతారు.. కొంతమంది ఆ అంచనాలను తాకలేరు. అయితే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఈజీ అని.. అలానే అవకాశాలు అవే వస్తాయి అన్న అపోహ కూడా ఎప్పటినుండో ఉంది. కానీ నిజానికి ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుందేమో కానీ ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకొని అవకాశాలు దక్కించుకోవాలంటే మాత్రం అంత ఈజీ కాదు. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా చూశాం. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి సక్సెస్ అవ్వలేని హీరోలు ఎంతో మంది ఉన్నారు.. అలానే బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా తమ కష్టంతో, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి స్థాయిలో ఉన్న హీరోలు కూడా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అందులో నాగచైతన్య గురించి కూడా చెప్పుకోవచ్చు. అక్కినేని అనే బ్రాండ్ తో ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. మొదటి సినిమా జోష్ నిరాశపరిచినా కూడా ఆ తరువాత మాత్రం తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకోగలిగాడు చై. లవర్ బాయ్ పాత్రలు మాత్రమే కాదు మాస్ సినిమాలు కూడా చేస్తూ అటు క్లాస్ మాస్ ఆడియన్స్ ను సైతం అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ఇప్పటి వరకూ తన ప్రయాణంలో ఎన్నో పరాజయాలు చూసినా కూడా ఎక్కడా తన కాన్ఫిడెంట్ ను కోల్పోకుండా అదే డెడికేషన్ తో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందుకే ఇప్పుడు చాప కింద నీరులా వెళుతున్నట్టు వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
ప్రస్తుతం నాగ చైతన్య వరుసగా నాలుగు హిట్లను సొంతం చేసుకున్నాడు. మజిలీ సినిమాతో చాలా గ్యాప్ తరువాత మంచి హిట్ ను అందుకున్న చై.. ఆ తరువాత వెంటనే వెంకీ మామ తో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ రాగా ఇటీవలే లవ్ స్టోరీ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కరోనా టైమ్ లో కూడా ఈసినిమా భారీగానే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా బంగార్రాజు తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎన్నో సినిమాల కంటే లేట్ గా ఈసినిమా స్టార్ట్ అయింది. అయినా కూడా పండక్కి ఈసినిమాను బరిలోకి దింపి విజేతగా నిలిచింది. పెద్ద సినిమాలు కూడా పోటీ కి లేకపోవడంతో ఈసినిమాకు బాగా కలిసొచ్చింది. అందుకే రిలీజ్ అయి నాలుగురోజులు అవుతున్నా కూడా ఇంకా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబడుతుంది. ఇలా వరుసగా హిట్ లతో నాగ చైతన్య తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు.
ఇక ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ సినిమా చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాను కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: