మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు కుర్ర హీరో ఆశిష్ రెడ్డి. దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన ఆశిష్ రెడ్డి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఆశిష్ రెడ్డికి ఉన్నాయంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని ఆశిష్ రెడ్డి చెప్పినట్టు.. సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అప్పుడే రెండో సినిమాను కూడా లైన్ లో పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు కూడా దిల్ రాజు చెప్పి ఇప్పిటినుండే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ ను కూడా పెట్టారు. సుకుమార్ రైటింగ్స్ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. మరోవైపు ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే అయిందని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇక సుకుమార్ స్కూల్ నుండి ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఎవరికి వారు డైరెక్టర్స్ గా తమ ప్రతిభను చూపించుకుంటున్నారు. ఇటీవలే సుకుమార్ కు అసిస్టెంట్ గా చేసిన బుచ్చిబాబు ఉప్పెన తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మరి ఈ డైరెక్టర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో.. ఆశిష్ రెడ్డి మరో హిట్ ను ఇస్తాడో?లేడో? చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: