బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.“
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బంగార్రాజు” మూవీ తో హ్యాట్రిక్ సాధించి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా మారిన కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..” రంగస్థలం” సినిమా చూసాక రామ్ చరణ్ నటనకు ఫిదా అయిపోయాననీ , అందులో చరణ్ చాలా గొప్పగా నటించారనీ , ఆ సినిమా చూశాక ఆయనతో నటించాలని ఉందనీ తన మనసులో మాట ను బయటపెట్టారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: