మన సెలబ్రిటీలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తమ పెట్స్ తో మాత్రం కాస్త టైమ్ ను స్పెండ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తమ పైట్ డాగ్స్ పై తమకున్న ప్రేమను ఎప్పటికప్పుడు తమ పోస్ట్ ల ద్వారా తెలియచేస్తూనే ఉంటారు. ఆ లిస్ట్ లో టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ హీరో కూడా ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విజయ్ దేవరకొండ కూడా తన పెట్ డాగ్ కు సంబంధించిన ఫొటోలను కానీ వీడియోలను కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటాడు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి తన ఇన్ట్సా ద్వారా తన స్ట్రామ్ కు సంబంధించి ఒక ఫన్నీ వీడియోను పోస్ట్ చేశాడు. ఓ ప్రైవేట్ జట్ లో ప్రయాణంలో ఉన్న తమ్ముడు ఆనంద్ దేవరకొండ, పెట్ డాగ్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి తన పెట్ డాగ్ ఫస్ట్ ఫ్లయిట్ రైడ్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ఫైనల్ లో ఉండగా.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా బిజీగా ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. 2022, ఆగస్ట్ 25న లైగర్ సినిమా రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: