ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాధేశ్యామ్‘. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనుండగా.. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సీనియరో హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో పరమహంస అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు కృష్ణంరాజు పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా చిత్రయూనట్ ఆయనకు బర్త్ డే విషెస్ అందించారు. రెబల్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం అంటూ తమ ట్వీట్ లో పేర్కొన్నారు.
Here’s wishing our Legendary Dr. @UVKrishnamRaju garu aka #Paramahamsa A very Happy Birthday 💐. Wish you have a healthy and prosperous year ahead. #HBDKrishnamRajugaru #RadheShyam #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @RadheShyamFilm pic.twitter.com/PuyZ9bXbI7
— UV Creations (@UV_Creations) January 20, 2022
ఇక ఈసినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ తెలిసిందే కదా.. మళ్లీ కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో మళ్లీ రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. రిలీజ్ కు అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ కొంత వరకూ బాగానే ఉన్నా నార్త్ లో మాత్రం కాస్త ఇబ్బందికర సమస్యలు ఉండటంతో థియేటర్లు మళ్లీ మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈసినిమాను కూడా వాయిదా వేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారేమో చూడాలి.
కాగా ఇంకా ఈసినిమాలో సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.