
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 13


హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ లో వెంకటేష్ ?

పెళ్లి అంటే జోక్ కాదు

క్లైమాక్స్ చిత్రీకరణలో దసరా

బాలీవుడ్ ఫెయిల్యూర్స్ పై రాజమౌళి
అల్లు అర్జున్ కు లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022 అవార్డ్

వీరయ్య సర్ ప్రైజింగ్ వీడియో

కళ్యాణం కమనీయం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

హిందీ ప్రేక్షకులలో కాంతార మూవీ పై క్రేజ్

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు

కీరవాణి కి మాతృవియోగం

2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్

18 పేజెస్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ చేయగా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

వారసుడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా పవన్ కల్యాణ్?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వారసుడు తమిళ వెర్షన్ ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి ప్రేక్షకులను…

కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఫేవరేట్ మూవీ ఆఫ్ ది ఇయర్
AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో సత్యరాజ్, రాధిక, యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 10 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ లో వెంకటేష్ ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. రీసెంట్ గా సక్సెస్ ఫుల్ ఓరి దేవుడా మూవీతో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ ప్రస్తుతం ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ హిందీ మూవీలో వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా వెంకటేష్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

కళ్యాణం కమనీయం- వెడ్డింగ్ మెలోడియస్ ఓ మనసా సాంగ్ రిలీజ్
టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ కూడా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబర్ తో ప్రేక్షకుల ముందుకు రాగా అది మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ప్రస్తుతం మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ప్రస్తుతం ఈసినిమా షూటంగ్ ను ముగించుకునే పనిలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. పెళ్లి నేపథ్యంలో ఈసినిమా రూపొందించనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పటికే రిలీజ్…

పెళ్లి అంటే జోక్ కాదు
సెలబ్రిటీల పెళ్లిళ్లపై ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇక విశాల్ పెళ్లి కూడా గత కొద్దికాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలో ఒకసారి తనకు ఎంగేజ్ మెంట్ అయి పెళ్లి వరకూ రాకుండానే అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తరువాత కొంతకాలం సైలెంట్ గా ఉండగా.. ఈమధ్య మళ్లీ విశాల్ పెళ్లిపై పలు వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిలో భాగంగానే నటి అభినయతో ప్రేమలో ఉన్నట్టు కథనాలు కూడా వచ్చాయి. ఇక ఇటీవలే తన పెళ్లిపై స్పందిస్తూ విశాల్.. తనకు అరెంజ్‌డ్ మ్యారేజ్ సెట్ కాదని, లవ్ మ్యారేజ్‌నే చేసుకోవాలని ఉందని ఆయన అన్నారు. ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తా.. త్వరలోనే ఆమెను…

క్లైమాక్స్ చిత్రీకరణలో దసరా
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ ఫెయిల్యూర్స్ పై రాజమౌళి
గత రెండు మూడేళ్లుగా బాలీవుడ్ కు టైమ్ సరిగ్గా కలిసిరాలేదు అని చెప్పొచ్చు. ఏ సినిమా అయినా, ఏ జోనర్ అయినా, హీరో ఎవరైనా, ఎంత బడ్జెట్ సినిమా అయినా సరే ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్ కూడా పడిపోయింది. బాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే.. మరోపక్క సౌత్ సినిమాలు మాత్రం తమ హవాను చాటుతున్నాయి. ఒకరకంగా గత ఏడాది నుండి ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీదే అని చెప్పొచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఎన్నో సినిమాలు రాగా వాటిలో చాలు సినిమాలు బ్లాక్ బస్టర్లను అందుకున్నాయి. ఇక ఇక్కడ మాత్రమే కాదు.. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాయి.
అల్లు అర్జున్ కు లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022 అవార్డ్
మ్యూజికల్ హిట్ గంగోత్రి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది…

వీరసింహారెడ్డి సుగుణ సుందరి సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత…

థ్రిల్లింగ్ హార్రర్ మసూద ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈమధ్య చిన్నసినిమా, పెద్ద సినిమా అని కాదు.. ఏ సినిమాలో కంటెంట్ ఉంది అని మాత్రమే చూస్తున్నారు ఆడియన్స్. అందుకే చిన్న సినిమాలు కూడా అంత బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా వచ్చన మసూద సినిమా కూడా ఈ కేటగిరిలోకే చేరుతుంది. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా.. సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయింది. అంటే సినిమా సూపర్ హిట్ అయిందన్నమాట. దీంతో ఈసినిమా మంచి…

వీరయ్య సర్ ప్రైజింగ్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఇప్పుడు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఒక పక్క షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్.

కళ్యాణం కమనీయం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ . ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. అలానే రీసెంట్ గా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా వచ్చింది. ఇక ఈసినిమా హిలోరియస్ ఎంటర్ టైనర్ గా మంటి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సంతోష్ శోభన్

అమెజాన్ ప్రైమ్ వీడియో లో 2022 టాప్ 10 లో నెం 1 ప్లేస్ లో పుష్ప :ది రైజ్
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ…

హిందీ ప్రేక్షకులలో కాంతార మూవీ పై క్రేజ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ హవా దేశవ్యాప్తంగా ఎంత నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల మార్కెట్ ఇప్పుడు సాలిడ్ గా ఉంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లు కోసం ఎదురుచూస్తుంది.

కీరవాణి కి మాతృవియోగం
ఈ ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులను పొగొట్టుకుంది ఇండస్ట్రీ. రెబల్ స్టార్ కృష్టంరాజు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి లెజెండరీ నటీనటులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు మరణించారు. ఇక ఇప్పుడు మరో ప్రముఖ సంగీత దర్శకుడికి కూడా మాతృవియోగం కలిగింది. ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు ఎమ్ ఎమ్ కీరవాణి. కీరవాణి తల్లి బాల సరస్వతి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం ఆమె అస్వస్థతకి గురవడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె నేడు కన్నుమూశారు. కిమ్స్ నుంచి ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఇంటికి తరలించనున్నారు. కీరవాణి తల్లి మృతికి…

RRR సీక్వెల్ కోసం గ్రేట్ ఐడియా వచ్చింది- రాజమౌళి
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

కాంతార మూవీపై కమల్ హాసన్ , పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రశంసలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్
మరికొద్ది రోజుల్లో 2022 ముగిసిపోనుంది.. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాం. ఇక ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. 2020 లో అప్పుడే కరోనా ప్రభావం మొదలవ్వడం.. ఆ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండటంతో లాక్ డౌల్ ల వల్ల ఆ ఏడాది సినిమాలు రిలీజ్ కాలేకపోయాయి. గత ఏడాది కూడా అదే పరిస్థితి అయితే పరిస్థితికాస్త మెరుగుపడటంతో చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ రెండేళ్లలో పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు పలు కొత్త సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యాను. ఎన్నో సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవ్వగా.. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన…