బాలీవుడ్ ఫెయిల్యూర్స్ పై రాజమౌళి

Rajamouli About Failure Of Bollywood Films, Rajamouli About Bollywood Films, Failure Of Bollywood Films, Bollywood Films, SS Rajamouli, Director SS Rajamouli, SS Rajamouli Movies, SS Rajamouli Latest Movie, SS Rajamouli Upcoming Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

గత రెండు మూడేళ్లుగా బాలీవుడ్ కు టైమ్ సరిగ్గా కలిసిరాలేదు అని చెప్పొచ్చు. ఏ సినిమా అయినా, ఏ జోనర్ అయినా, హీరో ఎవరైనా, ఎంత బడ్జెట్ సినిమా అయినా సరే ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్ కూడా పడిపోయింది. బాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే.. మరోపక్క సౌత్ సినిమాలు మాత్రం తమ హవాను చాటుతున్నాయి. ఒకరకంగా గత ఏడాది నుండి ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీదే అని చెప్పొచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఎన్నో సినిమాలు రాగా వాటిలో చాలు సినిమాలు బ్లాక్ బస్టర్లను అందుకున్నాయి. ఇక ఇక్కడ మాత్రమే కాదు.. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ ఫెయిల్యూర్ కు కారణం ఏంటో ఇప్పటికే కమల్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ సినిమాలు చూసే ముందు భారతీయ చిత్రాలను చూడాలని హితవు పలికారు. ఇక ఇప్పుడు రాజమౌళి కూడా బాలీవుడ్ సినిమాలు బోల్తా కొట్టడానికి గల కారణం ఏంటో తెలిపారు. బాలీవుడ్ మేకర్స్ కు మంచి కంటెంట్ డెలివరీ చేయాలన్న హంగర్ పోయినట్టు కనిపిస్తుంది.. ఇండస్ట్రీ బిజినెస్ లోకి కార్పొరేట్స్ ఎంటర్ అవ్వడంతో.. యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కు రెమ్యునరేషన్స్ పెంచడం జరుగుతున్నాయి. దీనివల్ల చాలా మంది సంతృప్తి చెందుతూ కొత్తదాన్ని సాధించాలనే కోరికను కోల్పోయారు. కానీ సౌత్ లో మాత్రం నెక్స్ అవకాశం కోసం స్కోర్ చేస్తూనే ఉండాలి. కాబట్టి, మేము స్థాయిని పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాము. కానీ, ఇక్కడ కూడా మనం ఒక పెద్ద, క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు మనకు లభించే బిజినెస్ ఆఫర్‌లను చూసి రిలాక్స్ అవ్వకూడదు. విజయాన్ని సాధించేందుకు నిరంతరం మన బలాన్ని కూడగట్టుకోవాలి అంటూ తెలిపాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.