సెలబ్రిటీల పెళ్లిళ్లపై ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇక విశాల్ పెళ్లి కూడా గత కొద్దికాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలో ఒకసారి తనకు ఎంగేజ్ మెంట్ అయి పెళ్లి వరకూ రాకుండానే అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తరువాత కొంతకాలం సైలెంట్ గా ఉండగా.. ఈమధ్య మళ్లీ విశాల్ పెళ్లిపై పలు వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిలో భాగంగానే నటి అభినయతో ప్రేమలో ఉన్నట్టు కథనాలు కూడా వచ్చాయి. ఇక ఇటీవలే తన పెళ్లిపై స్పందిస్తూ విశాల్.. తనకు అరెంజ్‌డ్ మ్యారేజ్ సెట్ కాదని, లవ్ మ్యారేజ్‌నే చేసుకోవాలని ఉందని ఆయన అన్నారు. ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తా.. త్వరలోనే ఆమెను మీకు పరిచయం చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా మరోసారి తన పెళ్లిపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న విశాల్ ను వచ్చే ఏడాదైనా పెళ్లి చేసుకుంటారా? అని అడుగగా దానికి సమాధానంగా విశాల్.. ప్రభాస్ పెళ్లి చేసుకున్న వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని దీనికి సమాధానంగా సరదాగా చెప్పాడు. పెళ్లి అంటే జోక్ కాదని.. పెళ్లి అంటే ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని తెలిపాడు. వృత్తి పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నామో వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉండాలని చెప్పారు. నటుడిగా తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని తెలిపాడు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతం తాను సినిమాలపైనే దృష్టిని కేంద్రీకరించానని చెప్పాడు. చూద్దాం మరి విశాల్ వచ్చే ఏడాది అయినా చేసుకుంటాడేమో..
కాగా తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న సినిమా లాఠీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మార్క్ ఆంటోని అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు విశాల్ లిస్ట్ లో ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: