మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఇప్పుడు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఒక పక్క షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తన సోషల్ మీడియా అకౌంట్స్ తన సినిమాల గురించి, వ్యక్తిగత సంగతుల గురించి ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూనే ఉంటారు చిరు. దీనిలో భాగంగానే రోజు సాయంత్రం 6 గంటలకు నా ఇన్స్టాగ్రమ్ ద్వారా ఒక చిన్న సర్ప్రైజ్ రాబోతోంది అందరూ సిద్ధంగా ఉండండి అంటూ ఒక పోస్ట్ చేసారు. దీంతో మెగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఆ టైమ్ రానే వచ్చేసింది. చెప్పినట్టే చిరు తన ఇన్ట్సాలో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటంటే.. వాల్తేరు వీరయ్య షూటింగ్ లో భాగంగా అక్కడి లోకేషన్ కు సంబంధించి వీడియో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో.. ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ శృతి హాసన్‌తో ఓ సాంగ్ షూటింగ్ పూర్తయ్యింది. మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది విజువల్స్ కానీ, సాంగ్ కానీ.. మేం చేసిన లొకేషన్లు రియల్లీ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో ఈ లొకేషన్ ఉంది. స్విట్జర్లాండ్, ఇటలీ బార్డర్‌లో ఉన్న ఆర్బ్స్ మౌంటేన్ లోయలో ఇది ఉంటుంది. ఆ లోయ అందాలు మంచుతో కప్పబడిన తర్వాత ఆ అందం అంతా ఇంతా కాదు. నాకైతే చాలా బాగా నచ్చింది.
మైనస్ 8 డిగ్రీల చలిలో డాన్సు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ మిమ్మల్ని అలరించడానికి ఆ కష్టం కష్టంగా అనిపించదు. టీమ్ మొత్తం చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం బాగా వచ్చిందని నమ్ముతున్నాం. నేను ఆపుకోలేక మీతో పంచుకోవాలనిపించింది. నేనే స్వయంగా అందమైన విజువల్స్ ని బంధించి మీ కోసం పంపిస్తున్నా. మీరూ చూసి ఆనందిస్తారనిపించింది. త్వరలో లిరికల్ వీడియో మీ ముందుకు రాబోతుంది. అయితే ఈ సాంగ్‌కి సంబంధించిన చిన్న బిట్‌ని మీకు లీక్ చేస్తున్నా` అంటూ లిరిక్ పంచుకున్నాడు చిరు. నువ్వు శ్రీదేవైతే.. ఆ అయితే.. నేను చిరంజీవంటా.. నాయ్యే నాయ్యే.. అంటూ దేవి శ్రీ ప్రసాద్ పాడిన పాటని విడుదల చేశారు చిరంజీవి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: