ఈ ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులను పొగొట్టుకుంది ఇండస్ట్రీ. రెబల్ స్టార్ కృష్టంరాజు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి లెజెండరీ నటీనటులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు మరణించారు. ఇక ఇప్పుడు మరో ప్రముఖ సంగీత దర్శకుడికి కూడా మాతృవియోగం కలిగింది. ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు ఎమ్ ఎమ్ కీరవాణి. కీరవాణి తల్లి బాల సరస్వతి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం ఆమె అస్వస్థతకి గురవడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె నేడు కన్నుమూశారు. కిమ్స్ నుంచి ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఇంటికి తరలించనున్నారు. కీరవాణి తల్లి మృతికి టాలీవుడ్‌లోని ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మనసు మమత సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కీరవాణి. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకూ ఆయన తన సంగీతంతో అలరిస్తూనే ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళికి ఈయన ఆస్థాన సంగీత దర్శకుడు. 3 దశాబ్దాలుగా ఆయన తెలుగులో మాత్రమే కాదు తమిళ , కన్నడ , మలయాళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించారు. గాయకుడిగా పలు హిట్ సాంగ్స్ ఆలపించారు. ఆయన కెరీర్ లో నేషనల్ అవార్డ్స్ తో పాటు ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. ఆయనకు ఇద్దరు తనయులు కాలభైరవ, సింహా. వీరిలో కాలభైరవ తండ్రి మార్గంలోనే సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. మరోవైపు సింహా తన నటనతో మెప్పిస్తూ సినిమాలు చేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: