గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ . ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. అలానే రీసెంట్ గా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా వచ్చింది. ఇక ఈసినిమా హిలోరియస్ ఎంటర్ టైనర్ గా మంటి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సంతోష్ శోభన్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ప్రస్తుతం ఈసినిమా షూటంగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఓ మనసా అంటూ వచ్చే ఈపాటను ఈనెల 15వ తేదీన 12గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు.
An instant trending ‘Wedding Melody’ #OhManasa lyrical video from #KalyanamKamaneeyam streaming at 15th @ 12PM ❤ Stay Tuned ✨️
✍🏻@kk_lyricist
🎶 & 🎤 #ShravanBharadwaj#SanthoshShoban @priya_Bshankar @Dir_Anilkumar #KarthikGattamneni #SatyaG @UV_Creations @UVConcepts_ pic.twitter.com/wFAV6yM3ZX— UV Creations (@UV_Creations) December 14, 2022
కాగా ఈసినిమాలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కార్తీక్ ఘట్టమనేని, సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: