ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ హవా దేశవ్యాప్తంగా ఎంత నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల మార్కెట్ ఇప్పుడు సాలిడ్ గా ఉంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లు కోసం ఎదురుచూస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈనేపథ్యంలోనే బాలీవుడ్ దర్శకులకు విలక్షణ నటుడు కమల్ హాసన్ ఒక సూచన అదేంటంటే.. హిందీ, బెంగాలీ సినిమాలను చూస్తూ చాలా విషయాలను నేర్చుకోవచ్చని చెప్పారు. హిందీ సినీ పరిశ్రమకు ఏమీ తెలియదని మీరు అనుకోవచ్చని… తాను మాత్రం హిందీ పరిశ్రమ నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సూర్యుడు దక్షిణాదిన ప్రకాశిస్తున్నాడని… అందుకే దక్షిణాది చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఈ ప్రకాశం ఇలాగే కొనసాగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈసందర్భంగా కమల్ సినిమా హిట్ కావాలంటే ఏం చేయాలో బాలీవుడ్ దర్శకులకు సూచించారు. ఇంగ్లీష్ సినిమాలు చూసే ముందు భారతీయ చిత్రాలను చూడాలని హితవు పలికారు. మరి కమల్ సూచనను బాలీవుడ్ దర్శకులు పాటిస్తారేమో చూద్దాం..
కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్నఇండియన్ 2 సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీనితో పాటు విక్రమ్ సీక్వెల్ కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. వీటితో పాటు పలు ప్రాజెక్టులను కమల్ లైన్ లో పెడుతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























