
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 12


అందరికీ నేను నచ్చాలని లేదు

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

స్టైలిష్ లుక్ లో హీరో సుశాంత్

కనెక్ట్ మూవీ ట్రైలర్ పై జాన్వీ కపూర్ ప్రశంసలు

ధమాకా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా శ్రీలీల

వారసుడు-మహేష్, చరణ్ ఫస్ట్ ఛాయిస్

సెన్సార్ పూర్తిచేసుకున్న 18 పేజెస్

వాల్తేరు వీరయ్య సెకండ్ సింగిల్ పై భారీ హైప్

ఇండియన్ 2 కోసం కమల్ డెడికేషన్

ధమాకా ట్రైలర్ రిలీజ్

ఫోకస్ ఆన్ దసరా

బాపు బొమ్మ ప్రణీత రీఎంట్రీ కి రెడీ

ధమాకా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వాల్తేరు వీరయ్య లో పోలీస్ స్టేషన్ ఫైట్ పూనకాలు గ్యారంటీ - దర్శకుడు బాబీ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా2023 జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అందరికీ నేను నచ్చాలని లేదు
ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అయితే అలా మాట్లేడే హీరోయిన్స్ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇక అలాంటి కోవలోకే వస్తుంది హీరోయిన్ తాప్సీ కూడా. ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైన తాప్సీ ఆతరువాత పలు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లిన తరువాత తాప్సీ సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది సాయికుమార్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ తనదైన ముద్రను వేశాడు. ఇక ప్రస్తుతం అయితే ఆది సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన లిస్ట్ లో ఇప్పుడు చాలా సినిమాలే ఉన్నాయి. అందులో టాప్ గేర్ సినిమా కూడా ఒకటి. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించగా అందులో భాగంగానే పలు పోస్టర్లు, పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. వాటికి బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను…

స్టైలిష్ లుక్ లో హీరో సుశాంత్
సక్సెస్ ఫుల్ కాళిదాసు (2008 ) మూవీ తో సుశాంత్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. అడ్డా , చి || ల|| సౌ || వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుశాంత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగానే కాకుండా సుశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి సిద్ధం అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ అల .. వైకుంఠపురము లో ..మూవీ లో సుశాంత్ కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

కనెక్ట్ మూవీ ట్రైలర్ పై జాన్వీ కపూర్ ప్రశంసలు
తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఉ మెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు.

ధమాకా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా శ్రీలీల
కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం శ్రీలీల యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌తేజ్ సినిమాతో పాటు గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ లో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న#SSMB 28 మూవీ లో రెండవ హీరోయిన్ గా శ్రీలీల ఎంపిక అయ్యారు. రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20 మూవీ లో రామ్ కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32 మూవీ లో నితిన్ కు జోడీగా శ్రీలీల…

ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సెన్సేషన్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందిరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ఎంతో గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది ఈసినిమా. ఇంకా పలు అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు.

వారసుడు-మహేష్, చరణ్ ఫస్ట్ ఛాయిస్
‘మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో విజయ్ ‘వారసుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదుప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. దీనిలోభాగంగా ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రంజితమే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ పై మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా2023 జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న 18 పేజెస్
ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా హిట్ ను కొట్టాడు నిఖిల్. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. నిఖిల్ నుండి వస్తున్న కొత్త సినిమా 18 పేజెస్ ఈసినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే వీరి కాంబనేషన్ లో వచ్చిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో ఈసినిమాపై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమానుండి టీజర్ అలానే ఒక్కొక్కటిగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి…

గూగుల్ సెర్చ్ లో నంబర్ వన్ సౌత్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీన బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కాజల్ కథానాయికగా తెరకెక్కిన కరున్ గాపియం, ఘోష్టి తమిళ మూవీస్, ఉమ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ లో నెం 1 గా అవతార్ 2
బ్లాక్ బస్టర్ టెర్మినేటర్, టైటానిక్, పిరాన్హ 2 వంటి హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రధాన భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ కానుంది. భారత్లో అవతార్ 2 మూవీ డిసెంబరు 16న విడుదల కానుంది. మిగతా దేశాల్లో డిసెంబరు 14న రిలీజ్…

వాల్తేరు వీరయ్య సెకండ్ సింగిల్ పై భారీ హైప్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్…

వాల్తేరు వీరయ్య నుండి స్టైలిష్ మాస్ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడు బాబి. ఇక ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకే అటు మేకర్స్ ఇటు చిరు ఈసినిమాకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూనే ఉన్నారు.

ఇండియన్ 2 కోసం కమల్ డెడికేషన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియన్2 సినిమాతో వస్తున్నాడు. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అప్పట్లోనే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈమధ్యకాలంలోనే మళ్లీ ఈసినిమా షూటంగ్ ను మొదలుపెట్టారు. ఒకపక్క చరణ్ సినిమా కంప్లీట్ చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

యూకే సౌత్ ఏషియన్ సెలబ్రిటీ లిస్ట్ టాప్‌లో తారక్, చరణ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ధమాకా ట్రైలర్ రిలీజ్
మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. ఈసినిమాపై ఏర్పడిన క్రేజ్ వల్ల ఈసినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో ఒక పాత్రలో పక్కా మాస్ లుక్‌లో కనిపించగా.. మరో లుక్‌లో స్టైలిష్ అండ్ క్లాస్‌గా కనిపించనున్నట్టు సమచారం. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది…

ఫోకస్ ఆన్ దసరా
న్యాచురల్ స్టార్ నాని ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే నాని హిట్ 2 సినిమాతో నిర్మాతగా మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. గతంలో శైలన్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా తీయగా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమా హిట్ అవ్వడంతో నాని తన బ్యానర్ పైనే హిట్ 2 సీక్వెల్ ను తెరకెక్కించి ఈ సీక్వెల్ తో కూడా హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అయితే హిట్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

బాపు బొమ్మ ప్రణీత రీఎంట్రీ కి రెడీ
పోర్కి (2010 ) మూవీ తో శాండల్ వుడ్ కు కథానాయికగా పరిచయం అయిన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో మూవీ తో టాలీవుడ్, ఉదయన్ మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ, తెలుగు,తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో ప్రణీత తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హంగామా 2 మూవీ తో ప్రణీత బాలీవుడ్ లో అడుగు పెట్టారు. భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా మూవీ లో ప్రణీత అతిథి పాత్రలో నటించారు.