2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్

2022 Top 10 Most Popular Indian Movies, Top 10 Indian Movies Of 2022, 2022 Top 10 Indian Movies, Top 10 Indian Movies, RRR, The Kashmir Files, KGF Chapter 2, Vikram, Kantara, Rocketry, Major, Sita Ramam, Ponniyin Selvan 1, 777 Charlie, Rajamouli Movies, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movie, S. S. Rajamouli, Ajay Devgn, Ram Charan, NTR, Alia Bhatt, Olivia Morris, Shriya Saran, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR Latest News, RRR Telugu Movie, RRR Movie Live Updates, RRR Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మరికొద్ది రోజుల్లో 2022 ముగిసిపోనుంది.. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాం. ఇక ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. 2020 లో అప్పుడే కరోనా ప్రభావం మొదలవ్వడం.. ఆ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండటంతో లాక్ డౌల్ ల వల్ల ఆ ఏడాది సినిమాలు రిలీజ్ కాలేకపోయాయి. గత ఏడాది కూడా అదే పరిస్థితి అయితే పరిస్థితికాస్త మెరుగుపడటంతో చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ రెండేళ్లలో పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు పలు కొత్త సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యాను. ఎన్నో సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవ్వగా.. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ఇంటర్నేషనల్ అవార్డులు సైతం దక్కించుకుంది. ఇంకా పలు అవార్డులు వస్తూనే ఉన్నాయి.

ద కశ్మీర్ ఫైల్స్

నిజానికి గత కొద్ది కాలంగా బాలీవుడ్ కు మాత్రం సరైన సక్సెస్ లు రావడం లేదని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఒకటి రెండు సినిమాలు మాత్రం బాగానే ప్రభావితం చూపాయి. వాటిలో ద కశ్మీర్ ఫైల్స్ సినిమా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.

కె.జి.యఫ్ 2

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ య‌ష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కె.జి.యఫ్2. పార్ట్ 1 బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో రెండో భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఆ అంచ‌నాల‌ను మించేలా సినిమాను రూపొందించారు మేక‌ర్స్‌. ఇక ఈపార్ట్ 2 కూడా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని ఎన్నో కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

విక్రమ్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఎన్నో అంచనాల మధ్య జులై3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈసినిమా కమల్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందిచడమే కాదు.. త‌మిళంలో ‘బాహుబ‌లి-2’ రికార్డును బ్రేక్ చేసి కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది. ఇక తెలుగులో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ అందించింది.

కాంతార

రీసెంట్ గా వచ్చిన కాంతార సినిమా మరోసారి సౌత్ సినిమా సత్తా చూపించింది. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు పలు భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రాకెట్రీ

మాధవన్ దర్శకత్వంలో రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈసినిమా రూపొందించారు. పాకిస్థాన్ కు గూఢచార్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ఎన్నో ఏళ్ల తరువాత నిర్దోషిగా నిరూపించబడి బయటకు వచ్చారు. ఆ తరువాత మళ్లీ ఇస్రో శాస్త్రవేత్తగా సేవలు అందించారు. ఇలాంటి నిజ సంఘటనలతో ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

మేజర్

విభిన్నమైన కథలతో మంచి విజయాలు సాధించవచ్చని మరోసారి మేజర్ సినిమాతో నిరూపించాడు అడివి శేష్. అడివి శేష్ ప్ర‌ధాన పాత్ర‌లో శ‌శికిర‌ణ్ టిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమా జూన్3న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. దేశవ్యాప్తంగా ఈసినిమా మంచి ఆదరణ దక్కించుకుంది. విమర్శకులు ప్రశంసలు సైతం దక్కించుకుంది.

సీతారామం

హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక మందన్న కీలక పాత్రలో వచ్చిన సినిమా సీతారామం. పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథగా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ ను సొంతం చేసుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం హిందీ భాషలలో కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

పొన్నియన్ సెల్వన్

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా పొన్నియన్ సెల్వన్. ‘ఓకే బంగారం’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు కమర్షియల్‌ హిట్టు లేదు. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 30 వ తేదీన రిలీజ్ అయింమరికొద్ది రోజుల్లో 2022 ముగిసిపోనుంది.. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాం. ఇక ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. 2020 లో అప్పుడే కరోనా ప్రభావం మొదలవ్వడం.. ఆ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండటంతో లాక్ డౌల్ ల వల్ల ఆ ఏడాది సినిమాలు రిలీజ్ కాలేకపోయాయి.ది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించింది.

777 ఛార్లి

కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కత్వంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ఛార్లి 777. కన్నడలో రిలీజ్ అయిన ఈసినిమా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో కూడా ఈసినిమా రిలీజ్ అయి ఇక్కడ కూడా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =