
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 14


ఆది పినిశెట్టి హార్రర్ సినిమా టైటిల్ ఫిక్స్

ధమాకా ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

స్టైలిష్ లుక్ లో హీరో నాని

స్లిమ్ లుక్ లో మక్కల్ సెల్వన్

త్వరలో తెలుగు సినిమాలో నటిస్తా

25 రోజులు పూర్తి చేసుకున్న మసూద

రిలీజ్ అయిన బట్టర్ ఫ్లై మూవీ ట్రైలర్

దర్శకుడు రాజమౌళి , కీరవాణి లకు ప్రభాస్ అభినందనలు

హిట్ 3 కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

తలైవా కు లోక నాయకుడి బర్త్ డే విషెస్

స్పెషల్ డే కి ఒక్కడు రీ రిలీజ్

సెన్సార్ పూర్తిచేసుకున్న ధమాకా

కార్తికేయ 3 మూవీ అప్ డేట్

విశాల్ లాఠీ ట్రైలర్ రిలీజ్

హీరోలు రవితేజ, అడివి శేష్ లపై మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఫెమీనా మిస్ ఇండియా హరియాణ 2018 టైటిల్ విన్నర్ మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తరువాత మాస్ మహారాజా రవితేజ కు జంటగా మీనాక్షి ఖిలాడి మూవీలో నటించారు. అడివి శేష్, మీనాక్షి జంటగా తెరకెక్కిన HIT:ది సెకండ్ కేసు ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీతో మీనాక్షి ఫస్ట్ హిట్ అందుకున్నారు.

ఆది పినిశెట్టి హార్రర్ సినిమా టైటిల్ ఫిక్స్
కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు ఆది. అందుకే అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడప్పుడు తను చేసే సినిమాలు కమర్షియల్ గా అనుకొన్నంత విజయాన్ని అందుకోకపోయినా… వైవిధ్యమైన కథల్ని మాత్రం పరిచయం చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవాలకు రామ్‌చరణ్ కు ఆహ్వానం
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న#RC15 మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ తాజాగా అహ్మదాబాద్ లో జరిగే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు.

ధమాకా ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఆరేంజ్ హిట్ మళ్లీ మాస్ మహారాజా రవితేజకు దక్కలేదు. ప్రస్తుతం అయితే ఆశలన్నీ రాబోతున్న ధమాకా మీదనే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ వరుస అప్‌డేట్‌లను ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలోభాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ లు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు ప్రియాంక చోప్రా అభినందనలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

స్టైలిష్ లుక్ లో హీరో నాని
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

స్లిమ్ లుక్ లో మక్కల్ సెల్వన్
తమిళ స్టార్ విజయ్ సేతపతి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి మంచి కథలతో టాప్ రేంజ్ కు ఎదిగాడు. విజయ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం అందరిలో ఉంది. ఇక కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది వచ్చిన విక్రమ్ సినిమాలో విలన్ పాత్రలో నటించగా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత డీఎస్పీ సినిమాతో వచ్చాడు కానీ ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

త్వరలో తెలుగు సినిమాలో నటిస్తా
దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల హవా ఎంతం నడుస్తుందో చూస్తూనే చూశాం. ఇక ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు కూడా సంచలన విజయాలు సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన కాంతార కూడా సౌత్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. అందుకే సౌత్ సినిమాలపై, సౌత్ హీరోలపై హిందీ నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది అయితే ఇప్పుడు తెలుగులో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ బాలీవుడ్ యంగ్ హీరో తెలుగులో త్వరలో నటిస్తా అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు వరుణ్ ధావన్.

25 రోజులు పూర్తి చేసుకున్న మసూద
మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలో తెరకెక్కిన హర్రర్ డ్రామా మసూద మూవీ18 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించింది. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు . ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేయడం విశేషం.

రిలీజ్ అయిన బట్టర్ ఫ్లై మూవీ ట్రైలర్
జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వశాఖ లో పనిచేసిన గంటా సతీష్ బాబు దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకునే కథ కథనాలతో బట్టర్ ఫ్లై థ్రిల్లర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో భూమిక చావ్లా, నీహాల్ కీలక పాత్రలు పోషించారు. అర్విజ్ గిడియన్ కట్టా సంగీతం అందించారు. అనుపమ పుట్టిన రోజు సందర్భంగా బటర్ ఫ్లై ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దర్శకుడు రాజమౌళి , కీరవాణి లకు ప్రభాస్ అభినందనలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
అవతార్ మూవీ తెలుగు వెర్షన్ కు అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్
బ్లాక్ బస్టర్ టెర్మినేటర్, టైటానిక్, పిరాన్హ 2 వంటి హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రధాన భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ కానుంది. భారత్లో ఈ ఏడాది డిసెంబరు 16న విడుదల కానుంది. మిగతా దేశాల్లో డిసెంబరు 14న రిలీజ్…

పాన్ ఇండియాగా విరూపాక్ష- టైటిల్ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్
మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన సినిమాలతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. గత ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

హిట్ 3 కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తుందని చెప్పొచ్చు. కొత్త కొత్త కథలతో హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అందులో శైలేష్ కొలను కూడా ఉన్నాడు. రీసెంట్ గానే హిట్ 2 తో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఇంతకుముందు తన నుండి వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందించిన ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సీక్వెల్ గా హిట్ 2 ను తెరకెక్కించి ఇటీవల రిలీజ్ చేశారు. అడివి శేష్ నటించిన ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అప్పుడే ఈసినిమాకు ఏడు ప్రాంచైజీస్ ఉన్నట్టు తెలిపాడు డైరెక్టర్. ఇక…

తలైవా కు లోక నాయకుడి బర్త్ డే విషెస్
కోలీవుడ్ , టాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రజనీకాంత్ తలైవా , కమల్ హాసన్ లోక నాయకుడు గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ అభిమానుల సంఖ్యా అధికమే. హీరో రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విక్రమ్ మూవీ తో భారీ హిట్ కొట్టిన కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ (భారతీయుడు ) మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ లో నటిస్తున్నారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 కి ఆర్ ఆర్ ఆర్ నామినేట్ పై ఎన్టీఆర్ స్పందన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

స్పెషల్ డే కి ఒక్కడు రీ రిలీజ్
ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇక రెండు రోజుల క్రితమే.. తలైవా రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా బాబా సినిమా కూడా రీరిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా ఒకటి రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను రీరిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా ఈసినిమా రికార్డ్ కలెక్షన్స్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు మహేష్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఒక్కడు ను కూడా రీ రిలీజ్ చేయనున్నారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న ధమాకా
మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో గ్రాండ్ గా రూపొందిన ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

కార్తికేయ 3 మూవీ అప్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా అద్భుత రెస్పాన్స్ అందుకున్న కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా…

విశాల్ లాఠీ ట్రైలర్ రిలీజ్
హీరో విశాల్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవ్వడానికి తమిళ్ హీరోనే అయినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆయనపై మంచి అభిమానం ఉంది ప్రేక్షకులకు ప్రస్తుతం విశాల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో లాఠీ సినిమా కూడా ఒకటి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నరుస అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ దగ్గర నుండి టీజర్ వరకూ అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.