టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ చేయగా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ నేడు అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 17వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ టేస్తున్నట్టు ఓ చిన్న వీడియో రిలీజ్ చేస్తూ తెలిపారు. ఇక ఈవీడియోలో అనుపమ ట్రైలర్ రిలీజ్ డేట్ ని ఒక ఉత్తరంలో రాసి నిఖిల్ ఇస్తుంది.. అయితే అనుపమను పట్టించుకోకుండా నిఖిల్ మొబైల్ మాయలో మునుగుతాడు. అప్పుడు ఆ పేజీని సగం చింపేసి ఆమె తీసుకు వెళుతుంది. ఇక ఆ కాగితంలో ట్రైలర్ ఆన్ అని ఉంటుంది.
This 𝟏𝟕𝐭𝐡 𝐃𝐄𝐂 💥 Bringing you the Exciting, Enthralling Trailer of the Crazy Love Story ~ #18Pages 🤩
Get ready to Witness the Fun & Madness of #18PagesTrailer🤩@aryasukku @actor_Nikhil @anupamahere @idineshtej @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl #18PagesOnDec23 pic.twitter.com/2tFhdTWQOR
— Geetha Arts (@GeethaArts) December 15, 2022
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: