ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 96
సంక్రాంతి తరువాత సినిమాల సందడి
కామెడీ కొనసాగిస్తా -అల్లరి నరేష్
చిరు 'లూసిఫర్' రీమేక్ ప్రారంభం
అల్లు అర్జున్ డ్యాన్స్ కు అభిమాని
'సురేష్ ప్రొడక్షన్స్' నుండి మరో కొరియన్ రీమేక్

8ఏళ్ల గ్యాప్ తర్వాత తమిళ్ లో రీ ఎంట్రీ ..!
'లూసిఫర్' మ్యూజికల్ జర్నీ స్టార్ట్

పూజాహెగ్డే ఎమోషనల్ ఫీలింగ్స్

#NS23 నుండి క్రేజీ అప్ డేట్
మెగా అభిమానులకు గుడ్ న్యూస్
బ్లాక్ బస్టర్ "పెదరాయుడు "
విజయ్ దేవరకొండ హ్యాపీ ఎమోషనల్
'బంగారు బుల్లోడు' ట్రైలర్ రిలీజ్

'మారి 2' సాయి పల్లవి కామెడీ సీన్
సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
"లక్ష్య "మూవీ అప్ డేట్

'RRR' క్లైమాక్స్ షూట్
"తలైవి "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
రష్మిక "పొగరు " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
శాండల్ వుడ్ , టాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక నటించిన "పొగరు " కన్నడ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్ పై నంద కిషోర్ దర్శకత్వంలో ధృవ సర్జా , రష్మిక జంటగా కన్నడ , తెలుగు భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "పొగరు " మూవీ ఫిబ్రవరి 19 వ తేదీ రిలీజ్ కానుంది. ధనంజయ్ , రాఘవేంద్ర రాజ్ కుమార్ , రవి శంకర్ , మృణాళిని రవి ముఖ్య పాత్రలలో నటించారు. చందన్ శెట్టి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి తరువాత సినిమాల సందడి
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్ తో థియేటర్స్ ప్రేక్షకులతో కళకళ లాడుతున్నాయి. సినిమాల పై ఉన్న ప్రేమాభిమానాలు ప్రేక్షకులు నిరూపించుకున్నారు. రవితేజ "క్రాక్ ", రామ్ "RED ", బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "అల్లుడు అదుర్స్ ", తమిళ స్టార్ హీరో విజయ్ "మాస్టర్ "(డబ్బింగ్ ) మూవీస్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్నాయి. ఈ మూవీస్ కు ప్రేక్షకాదరణ లభించడం తో సంక్రాంతి తరువాత మరిన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
కామెడీ కొనసాగిస్తా -అల్లరి నరేష్
"కితకితలు ", "సీమశాస్త్రి ", బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి ", బెట్టింగ్ బంగార్రాజు ", "సుడిగాడు ", "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్ తో పెర్ఫార్మ్ చేసి అల్లరి నరేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ హీరో అల్లరి నరేష్ బ్లాక్ బస్టర్ "మహర్షి "మూవీ లో హీరో స్నేహితుడి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అల్లరి నరేష్ ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రం క్రైమ్ థ్రిల్లర్ "నాంది ", కామెడీ ఎంటర్ టైనర్ "బంగారు బుల్లోడు "మూవీస్ లో నటిస్తున్నారు.
చిరు 'లూసిఫర్' రీమేక్ ప్రారంభం
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఎంతోమంది డైరెక్టర్స్ పేర్లు వినిపించినా ఫైనల్ గా రీమేక్స్ స్పెషలిస్ట్ అయిన తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రానికి డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు. పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో మోహన్ రాజా అయితే సరిగ్గా రీమేక్ చేయగలడని మోహన్ రాజాను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ డ్యాన్స్ కు అభిమాని
"ఆర్య ", "దేశముదురు", "బద్రినాథ్ ", "రేసుగుర్రం ", "సరైనోడు ", "దువ్వాడ జగన్నాథం ", "అల .. వైకుంఠపురములో .. " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన డ్యాన్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అల్లు అర్జున్ తెలుగు , మలయాళ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను డబ్బింగ్ మూవీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో…
'సురేష్ ప్రొడక్షన్స్' నుండి మరో కొరియన్ రీమేక్
మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో సురేష్ ప్రొడక్షన్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల క్రితం స్థాపించిన ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు నిర్మించబడ్డాయి. అటు పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తమ ప్రొడక్షన్ హౌస్ నుండి రిలీజ్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు.

8ఏళ్ల గ్యాప్ తర్వాత తమిళ్ లో రీ ఎంట్రీ ..!
'ముకుందా', 'ఒక లైలా కోసం' చిత్రాలతో హీరోయిన్‌గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. మొదట్లో కాస్త హిట్స్ లేక ఇబ్బందిపడిన ఈ భామ ఇప్పుడు వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. ఇక ఇప్పుడు పలు సినిమాలతో టాప్ హీరోస్ తో సినిమాలు చేస్తూ తన కెరీర్ లో దూసుకుపోతుంది.
"గని"ఫస్ట్ లుక్ అద్భుతం - చిరంజీవి
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , బ్లూ వాటర్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా #VT 10 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోని తన క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ పొందారు. బాలీవుడ్ మూవీ "దబంగ్ "ఫేమ్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా ఉపేంద్ర , సునీల్ శెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
'లూసిఫర్' మ్యూజికల్ జర్నీ స్టార్ట్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే చెప్పే పేరు థమన్. ప్రస్తుతం థమన్ క్రేజ్ మాములుగా లేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ దాదాపు థమన్ ఖాతాలనో ఉన్నాయి. అసలే ఫుల్ డిమాండ్ లో ఉన్న థమన్ ను అల వైకుంఠపురములో ఆల్బమ్ థమన్ స్థాయిని మరింత పెంచింది. అందరు దర్శక నిర్మాతలు థమన్ వైపే చూసేలా చేసింది ఆ సినిమా. ఇక ప్రస్తుతం ఎలా లేదనుకున్న థమన్ ఓ అరడజను సినిమాలకు పైనే పని చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసాడు.

పూజాహెగ్డే ఎమోషనల్ ఫీలింగ్స్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే పలు మూవీ ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్"మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "రాధేశ్యామ్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్న పూజాహెగ్డే , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ , బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ ” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

#NS23 నుండి క్రేజీ అప్ డేట్
నేటి తరం హీరోల్లో నాగ శౌర్య తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని వైవిధ్యమైన నటనను కనబరుస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, కళ్యాణ్ వైభోగమే,ఛలో, అశ్వద్ధామ ఇలా పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు నాగశౌర్య.
మెగా అభిమానులకు గుడ్ న్యూస్
మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యం లో మెసేజ్ ఓరియెంటెడ్ గా “ఆచార్య” మూవీ తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా సోనూ సూద్ , సక్సెస్ ఫుల్ యాంకర్ అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ "పెదరాయుడు "
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , భానుప్రియ , సౌందర్య ప్రధాన పాత్రలలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పెదరాయుడు "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో మోహన్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. పెదరాయుడు తండ్రి పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ తన మేనరిజమ్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
విజయ్ దేవరకొండ హ్యాపీ ఎమోషనల్
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ కు యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అలాంటి హీరోకు తన సినిమా ఎవరైనా చూస్తారా అన్న డౌట్ వచ్చిందట. మరి ఆ డౌట్ ఎందుకొచ్చిందో అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.
'బంగారు బుల్లోడు' ట్రైలర్ రిలీజ్
గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

'మారి 2' సాయి పల్లవి కామెడీ సీన్
ధనుష్ హీరోగా గతంలో వచ్చిన మారి అప్పట్లో ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్ మారి 2 తో నాటీ డాన్ గా మరోసారి సందడి చేసాడు ధనుష్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సాయి పల్లవి నటించగా ఇద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే కామెడీ నవ్వు తెప్పిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ యూ ట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరో నటి వరలక్ష్మి కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా…
సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోనూసూద్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అరుంధతి " మూవీ లో నెగిటివ్ రోల్ లో నటించిన సోనూసూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "దూకుడు "మూవీ కి సినీ మా బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం ఒక , హిందీ , ఒక తమిళ , "ఆచార్య "తెలుగు మూవీ లో నటిస్తున్నారు.
"లక్ష్య "మూవీ అప్ డేట్
యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా మూడు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. "లక్ష్య ", "వరుడు కావలెను " మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న హీరో నాగశౌర్య , అనీష్ కృష్ణ దర్శకత్వంలో "#NS22 " మూవీ ను పూజాకార్యక్రమం తో ప్రారంభించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక కాగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

'RRR' క్లైమాక్స్ షూట్
మొత్తానికి రెండేళ్ల పైన కృషికి మరికొద్దిరోజుల్లో తెర పడనుంది. రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్(రౌధ్రం రణం రుధిరం). లాక్ డౌన్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా రాజమౌళి షూటింగ్ ను చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. "వాళ్లు అనుకున్నది సాధించేందుకు కొమురం భీమ్, సీతారామరాజు ఏకమయ్యారు. క్లైమాక్స్ షూటింగ్ మొదలయ్యింది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది" అని ట్వీట్ లో పేర్కొన్నారు.
"తలైవి "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయిక కాగా అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందించారు.