“ఆర్య “, “దేశముదురు”, “బద్రినాథ్ “, “రేసుగుర్రం “, “సరైనోడు “, “దువ్వాడ జగన్నాథం “, “అల .. వైకుంఠపురములో .. ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన డ్యాన్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అల్లు అర్జున్ తెలుగు , మలయాళ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను డబ్బింగ్ మూవీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




బాలీవుడ్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ సూపర్ హిట్ “హీరోపంతి “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “బాఘీ “, “బాఘీ 2”, “బాఘీ3” , “వార్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో టైగర్ ష్రాఫ్ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ లో యువ హీరోలలో టైగర్ ష్రాఫ్ బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే టైగర్ ష్రాఫ్ అభిమానులతో సోషల్ మీడియా లో ముచ్చటించారు. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు హీరో అల్లు అర్జున్ డ్యాన్స్ మూమెంట్స్ , స్టైల్ కు తానూ అభిమానినే అనీ , తాను కూడా అల్లు అర్జున్ లా పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాననీ టైగర్ ష్రాఫ్ జవాబిచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: