‘ముకుందా’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలతో హీరోయిన్గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. మొదట్లో కాస్త హిట్స్ లేక ఇబ్బందిపడిన ఈ భామ ఇప్పుడు వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. ఇక ఇప్పుడు పలు సినిమాలతో టాప్ హీరోస్ తో సినిమాలు చేస్తూ తన కెరీర్ లో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది ఈ భామ. 2012 లో తమిళ చిత్రం మూగమూడి ద్వారా పూజాహెగ్డే కథానాయికగా సినీరంగానికి పరిచయమైంది పూజ హెగ్డే. ఇక ఆ తర్వాత తెలుగులో బిజీ అయిపోయింది. మరో పక్క బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ తెలుగు, హిందీలో సినిమాలు చేసుకుంటుంది. ఇక ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత పూజాహెగ్డే తమిళ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. విజయ్ నటిస్తున్న 65వ చిత్రమిది. ఈ సినిమాను ఫిబ్రవరిలో సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ కు జోడీగా పూజ హెగ్డే ను తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఇక ప్రస్తుతం పూజ హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమా చేస్తుంది. తన షూటింగ్ పార్ట్ ను పూర్తిచేసుకుంది. దీనితో పాటు అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా చేస్తుంది. ఈ సినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























