ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 95
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ?
అఖిల్ న్యూ మూవీ ఫిబ్రవరి లో ప్రారంభం
స్టార్ హీరో సూర్య కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్
'లక్ష్య' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
సరికొత్త లుక్ కై అనుష్క వర్కౌట్స్
ఆ ఇద్దరి రుణం తీర్చుకోలేనిది - అలీ
అనుపమ పరమేశ్వరన్ సింగింగ్ టాలెంట్
వరుణ్ తేజ్ 'గని' లో అదే హైలైట్
'గుర్తుందా శీతాకాలం' ఫన్ ఫస్ట్ షెడ్యూల్
మదర్ క్యారెక్టర్స్ కు సిద్ధమే -శృతిహాసన్
డే &నైట్ షూటింగ్స్ తో రామ్ చరణ్ బిజీ
'శాకుంతలం' రూమర్స్ పై గుణ శేఖర్ క్లారిటీ
'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా
మహేష్ బాబు లేటెస్ట్ వర్కౌట్

'దొంగాట' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
రానా మిహికాల 'గోల్డెన్ బంధం'

ఇడ్లీ అమ్మే వ్యక్తి కి 'అజిత్' సహాయం
శృతిహాసన్ న్యూ పియానో..న్యూ నేమ్
'రాధే శ్యామ్' లో నా పాత్ర అదే
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పూజా హెగ్డే తన షూట్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ?
మాస్ మహారాజా రవితేజ , దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "క్రాక్ " మూవీ ఘనవిజయం సాధించడంతో దర్శకుడు గోపీచంద్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. పలువురు హీరోలు గోపీచంద్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యం లో బాలకృష్ణ మూవీ ఖాయం అయిందని వార్తలు వస్తున్నాయి.
అఖిల్ న్యూ మూవీ ఫిబ్రవరి లో ప్రారంభం
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజా హెగ్డే జంటగా రూపొందిన లవ్ స్టోరీ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తరువాత హీరో అఖిల్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ 'పోలీసు వారి హెచ్చరిక'
నాగశౌర్య వరుస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. లక్ష్య, వరుడు కావలెను సినిమాలు ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో రావడానికి సిద్దమయ్యాడు.
స్టార్ హీరో సూర్య కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్
యాక్ట్రెస్ కావాలని కోరుకున్న మోడల్ ప్రియాంక అరుళ్ మోహన్ "ఒంధ్ కథె హెల్ల "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. నాని హీరోగా రూపొందిన "గ్యాంగ్ లీడర్ "మూవీ తో ప్రియాంక కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న "డాక్టర్ "తమిళ మూవీ తో ప్రియాంక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రియాంక ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా అగ్రికల్చరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "శ్రీకారం " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
'లక్ష్య' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. అంతేకాదు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలన్న పట్టుదలతో ఇప్పుడు విభిన్నమైన కథలతో వస్తున్నాడు. అలా చేస్తున్న సినిమాల్లో ఒకటి 'లక్ష్య'. సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య ఈ సినిమా. ఈ సినిమా కోసం నాగశౌర్య తన లుక్ ను సైతం మార్చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా...దానికి మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.
సరికొత్త లుక్ కై అనుష్క వర్కౌట్స్
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సూపర్ హిట్ "అరుంధతి ", "వేదం ", "ఢమరుకం ", "రుద్రమ దేవి ", "బాహుబలి ", "భాగమతి "వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రతీ మూవీ లోనూ తన పాత్రలో వైవిధ్యం చూపిస్తున్న విషయం తెలిసిందే. తన పాత్రలకై శరీరాకృతి మార్చుకుంటూ అనుష్క ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు.
ఆ ఇద్దరి రుణం తీర్చుకోలేనిది - అలీ
వెండితెరపై బాలనటుడిగా.. హీరోగా.. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన అలీ ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. అలీ నిర్మాతగా అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాం పై తెరకెక్కుతున్న చిత్రం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. అలీ, నరేష్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.
అనుపమ పరమేశ్వరన్ సింగింగ్ టాలెంట్
సక్సెస్ ఫుల్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి”, “హలో గురు ప్రేమకోసమే “, “రాక్షసుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ ప్రస్తుతం “18 పేజెస్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.సూపర్ హిట్ “హుషారు “మూవీ ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న “రౌడీ బోయ్స్ ” మూవీ, మలయాళ సూపర్ హిట్ “హెలెన్ “మూవీ తెలుగు రీమేక్ లో అనుపమ కథానాయికగా ఎంపిక అయ్యారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ తెలుగు రాయడం నేర్చుకొనడం విశేషం.
వరుణ్ తేజ్ 'గని' లో అదే హైలైట్
ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందన్న సంగతి కూడా విదితమే. ఇక ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు సంబంధించి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'గని' అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.
'గుర్తుందా శీతాకాలం' ఫన్ ఫస్ట్ షెడ్యూల్
తన విలక్షణమైన నటనతో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సత్యదేవ్ హీరోగా, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వంలో కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మదర్ క్యారెక్టర్స్ కు సిద్ధమే -శృతిహాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ శృతి అభిమానులను అలరిస్తున్నారు. శృతి ప్రస్తుతం "వకీల్ సాబ్ ", "లాభం "తమిళ మూవీస్ లో కథానాయికగా నటించారు. శృతి హాసన్ కథానాయికగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో శృతి ఒక బాలుడి కి తల్లిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. దానికి కొంతమంది ప్రేక్షకులు హీరోయిన్, మదర్ క్యారెక్టర్ లో నటించడం ఏమిటి అని కామెంట్ చేస్తున్నారు.
డే &నైట్ షూటింగ్స్ తో రామ్ చరణ్ బిజీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం ", సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య "మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. "రౌద్రం రణం రుధిరం ", "ఆచార్య "రెండు మూవీస్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
'శాకుంతలం' రూమర్స్ పై గుణ శేఖర్ క్లారిటీ
గుణశేఖర్ పౌరాణిక కథాంశంతో 'శాకుంతలం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించాడు గుణశేఖర్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి గత కొద్దిరోజులుగా ఒక రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శకుంతల పాత్రలో సమంత చేయనుండడంతో.. సమంత లాంటి స్టార్ నటి సరసన దుష్యంతుడి పాత్రలో ఏ హీరో నటిస్తాడని విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దుష్యంతుడుగా రానాతో పాటు పలువురు ప్రముఖ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.
'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం రాపిడ్ స్పీడ్ లో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరుకులో ప్రారంభమవగా.. సుమారు 25 రోజులపాటు అరుకు, విశాఖపట్నంలో తొలి షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేశారు. ఒక్క షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను 80 శాతం పూర్తి చేశారంటే చెప్పొచ్చు ఎంత ఫాస్ట్ గా వున్నారో. ఇక ఇప్పుడు దాదాపు షూటింగ్ చివర దశకు చేరుకుంది.
మహేష్ బాబు లేటెస్ట్ వర్కౌట్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. నలభై సంవత్సరాల వయస్సు దాటినప్పటికీ అందం , ఫిట్ నెస్ తో కుర్ర హీరోలకు పోటీగా ఉంటూ మహేష్ బాబు అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా ఆకట్టుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులలో మహిళా అభిమానులు కూడా అధిక శాతం లో ఉండడం విశేషం. కరోనా కారణంగా లాక్ డౌన్ లో 10 నెలలపాటు ఇంటికే పరిమితం అయిన మహేష్ బాబు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే.

'దొంగాట' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు... అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అమాయకమైన అమ్మాయిగా సౌందర్య నటన.. దొంగగా జగపతి బాబు నటన.. సౌందర్య ను మోసం చేసే పాత్రలో సురేష్ నటన ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు కాబట్టే సినిమా అంత గొప్ప విజయం దక్కించుంది. కోడి రామకృష్ణ అంటేనే కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఈసినిమాలో కూడా కామెడీ అదే రేంజ్ లో ఉంటుంది. మరి ఆ సినిమానుండి కామెడీ సీన్స్ మీకోసం ...
రానా మిహికాల 'గోల్డెన్ బంధం'
ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్‌డౌన్ సమయంలో కొద్ది మద్ది అతిథుల మధ్య రానా- మిహికా బజాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అంతేకాదు అప్పటినుండి వారిద్దరి స్వీట్ మూమెంట్స్ కు సంబంధించి ఫొటోలు అప్పుడప్పుడు వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వుంటారు.

ఇడ్లీ అమ్మే వ్యక్తి కి 'అజిత్' సహాయం
కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. ఇక వారు చేసే సమాజ సేవ..పలువురికి చేసే గుప్తదానాలు బయటకు రావచ్చు.. రాకపోవచ్చు. అంతేకాదు వాళ్ళు కూడా బయటకు చెప్పుకోడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చుపించారనుకోండి.
శృతిహాసన్ న్యూ పియానో..న్యూ నేమ్
2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కొంత కాలం బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్లీ సినీ కెరీర్ లో బిజీ అయింది. రీసెంట్ గా తెలుగులో సంక్రాంతికి విడుదలైన 'క్రాక్'తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శృతి పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కింది.