మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యం లో మెసేజ్ ఓరియెంటెడ్ గా “ఆచార్య” మూవీ తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా సోనూ సూద్ , సక్సెస్ ఫుల్ యాంకర్ అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య “మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. “ఆచార్య “మూవీ కై హైదరాబాద్ శివార్లలో కోకాపేట్ వద్ద 20 ఎకరాలలో భారీ టెంపుల్ టౌన్ సెట్ ను రూపొందించారు. శరవేగం గా షూటింగు జరుపుకుంటున్న “ఆచార్య “మూవీ ని మే నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. “ఆచార్య “మూవీ టీజర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 వ తేదీ రిలీజ్ చేసి అభిమానులను చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ చేయనుందని సమాచారం. “సైరా నరసింహా రెడ్డి “మూవీ తరువాత మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























