మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో సురేష్ ప్రొడక్షన్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల క్రితం స్థాపించిన ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు నిర్మించబడ్డాయి. అటు పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తమ ప్రొడక్షన్ హౌస్ నుండి రిలీజ్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి ఇప్పుడు వీరి నుంచి మరో ఆసక్తికర సినిమా రావడానికి సిద్ధం అవుతుంది. జాపనీస్ “కీ ఆఫ్ లైఫ్” నుంచి కొరియన్ లో లక్కీ కీ గా తెరకెక్కించారు. కొరియన్ భాషకు చెందిన చిత్రం “లక్కీ కీ” అనే సినిమాకు రీమేక్ చేస్తున్నట్టుగా అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. అంతేకాదు అన్ని ఇండియన్ భాషల రీమేక్ హక్కులను తాము కొనుగోలు చేసినట్టుగా వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం మంచి నటుడిని.. దర్శకుడిని ఎంపిక చేసుకోనున్నట్టు కూడా తెలిపారు.
@SureshProdns @gurufilms1 & @skglobalent proudly announce the official Telugu remake of the popular Korean film “Luck Key” (originally “Key of Life” – Japanese). We have acquired the rights for all Indian languages, currently packaging it with a Popular Actor & Director.
— Suresh Productions (@SureshProdns) January 20, 2021
ఇప్పటికే మిస్‌గ్రానీ అనే కొరియన్ మూవీని తెలుగులో ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేసింది సురేష్ ప్రొడక్షన్స్. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా మంచి విజయం దక్కించుకుంది. మరి ఇప్పుడు ఈ రీమేక్ కూడా వారికి కలిసొస్తుందేమో చూడాలి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























