మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , బ్లూ వాటర్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా #VT 10 ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోని తన క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ పొందారు. బాలీవుడ్ మూవీ “దబంగ్ “ఫేమ్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా ఉపేంద్ర , సునీల్ శెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనవరి 19 వతేదీ బర్త్ డే సందర్భంగా హీరో వరుణ్ తేజ్ సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు అందుకున్నారు. హీరో వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా #VT 10 ” మూవీ యూనిట్ మూవీ టైటిల్ ను “గని “అనీ , “గని ” మూవీ లో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెగా స్టార్ చిరంజీవి , వరుణ్ తేజ్ కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు. “గని ” మూవీ ఫస్ట్ లుక్ అద్భుతం అనీ , వరుణ్ తేజ్ చిన్నపుడు తనతో ఉన్న ఫొటోను చిరంజీవి సోషల్ మీడియా లో షేర్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























