ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ కు యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అలాంటి హీరోకు తన సినిమా ఎవరైనా చూస్తారా అన్న డౌట్ వచ్చిందట. మరి ఆ డౌట్ ఎందుకొచ్చిందో అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. ఇక కరోనా వల్ల ఇన్నిరోజులు బ్రేక్ తీసుకోగా ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి కూడా విదితమే. లైగర్ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.
ఇకదీనితో అభిమానులు పాలాభిషేకాలు చేయడం, మూవీ టైటిల్‌ను ట్యాటుగా ఒంటిపై వేయించుకోవడంతో విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడు. మై లవ్స్.. నిన్న మీరంతా నన్ను ఎంతో ఎమోషనల్‌కి గురిచేశారు. అది కూడా హ్యాపీ ఎమోషనల్. మీ ప్రేమ నన్ను చేరింది. ఒకప్పుడు బాధపడేవాడిని. నేను చేసిన పనిని ఎవరైనా గుర్తిస్తారా. నా సినిమాలు చూసేందుకు ప్రజలు థియేటర్లకు వస్తారా అని అనుకొని బాధపడ్డ రోజులు ఉన్నాయి. నిన్న లైజర్ మూవీ ఫస్ట్ లుక్‌ని మాత్రమే విడుదల చేశాం… నేను మీకో హామీ ఇస్తున్నా. టీజర్ కోసం వెయిట్ చేయండి. నేషన్‌వైడ్ మ్యాడ్‌నెస్ పక్కా.. ప్రేమతో మీ విజయ్ దేవరకొండ అని తన ఇన్స్టా లో పేర్కొన్నారు.
View this post on Instagram




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























