యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా మూడు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. “లక్ష్య “, “వరుడు కావలెను ” మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న హీరో నాగశౌర్య , అనీష్ కృష్ణ దర్శకత్వంలో “#NS22 ” మూవీ ను పూజాకార్యక్రమం తో ప్రారంభించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక కాగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“లక్ష్య “మూవీలో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో చిత్రయూనిట్ హీరో నాగశౌర్య మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది . ప్రస్తుతం “లక్ష్య “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటుంది . ఈ షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం తో దర్శకుడు సంతోష్ పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి “లక్ష్య “మూవీని సమ్మర్ కు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. హీరో నాగశౌర్య 20వ మూవీ గా తెరకెక్కుతున్న “లక్ష్య “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























