ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 97
అభిమానులతో కాజల్ అగర్వాల్ ముచ్చట్లు
టాలీవుడ్ లో సముద్ర ఖని విలన్ గా బిజీ
'ఆదిపురుష్' లాంచ్ కు డేట్ ఫిక్స్
కమల్ హెల్త్ పై శృతి క్లారిటీ
'ఆదిపురుష్' మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్
అభిమానులకు రవితేజ బర్త్ డే గిఫ్ట్
హీరో అజిత్ లాంగ్ బైక్ ట్రిప్
మెగా ప్రిన్స్ 'గని'
బిజీగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి
హైదరాబాద్ టు ముంబై
కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం?
'రాధే శ్యామ్' టీం కు ప్రభాస్ గిఫ్ట్స్

"తలైవి " స్పెషల్ పోస్టర్ రిలీజ్
నటి కావాలని కలలు కన్నా- అదితి రావు హైదరి
ఆచార్య - 'సిద్ధ' గా చెర్రీ
నిర్మాత 'దొరస్వామి' కి రాజమౌళి సంతాపం
'లైగర్' గా రౌడీ హీరో
"RED" మూవీ సక్సెస్ మీట్ లో మాళవిక శర్మ
లాభాల బాటలో "అల్లుడు అదుర్స్ "
క్రాక్ పై 'చిరు' ప్రశంసలు
చాలా గ్యాప్ తర్వాత క్రాక్ సినిమాతో వచ్చి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు మాస్ మహారాజా రవితేజ. మంచి టాక్ ను సొంతం చేసుకోటమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ క్రాక్ సినిమాపై ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు తండ్రి చిరు కూడా క్రాక్ సినిమాను.. డైరెక్టర్ గోపీచంద్ పై ప్రశంసలు కురిపించినట్టు తెలిపాడు.
అభిమానులతో కాజల్ అగర్వాల్ ముచ్చట్లు
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు , తమిళ పలు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కాజల్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉన్న కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించారు.
టాలీవుడ్ లో సముద్ర ఖని విలన్ గా బిజీ
యాక్టర్ , డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సముద్రఖని "శంభో శివ శంభో ", "జండా పై కపిరాజు "మూవీస్ తో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.పలు తమిళ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , నెగటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సముద్రఖని "విచారణై "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
'ఆదిపురుష్' లాంచ్ కు డేట్ ఫిక్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. రాధేశ్యామ్ అయిపోయిందో లేదో 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో 'సలార్ సినిమాను ప్రారంభించారు.అప్పుడే ఆదిపురుష్ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్ చేసినట్టు చెప్పాడు డైరెక్టర్ ఓం రౌత్. ఇక ఈ సినిమా లాంచింగ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభించనున్నారని.. అలాగే దాదాపు ఎక్కువ శాతం మూవీ అదే స్టూడియోలో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది.
కమల్ హెల్త్ పై శృతి క్లారిటీ
కమల్ హాసన్ గతకొద్ది కాలంగా కాలికి సంబందించిన ఇన్ఫెక్షన్ తో భాదపడుతున్నారు. ఆమధ్య ఒక షూటింగ్ సమయంలో కమల్ కాలికి యాక్సిడెంట్ జరగడంతో అప్పుడు ఆపరేషన్ జరిగింది. అయితే ఆ తర్వాత రెస్ట్ తీసుకోకుండా.. సినిమా షూటింగ్ లు.. మరో పక్క ప్రచారాలతో బిజీగా ఉండటంతో గాయం మళ్లీ తిరగపెట్టింది. దీనితో కమలహాసన్ కు చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో వైద్యులు కాలికి శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది కమలహాసన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కుడి కాలు బోనుకి స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో కమలహాసన్ చేరారని వైద్యులు…
'ఆదిపురుష్' మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్
తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం 'ఆదిపురుష్' సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఓం రౌత్ ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఆగస్ట్ 11,2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
అభిమానులకు రవితేజ బర్త్ డే గిఫ్ట్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన మూవీస్ లో “క్రాక్ ” మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
హీరో అజిత్ లాంగ్ బైక్ ట్రిప్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ హీరో అజిత్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం హెచ్ వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై "తమిళ మూవీ లో నటిస్తున్నారు. "వాలిమై " మూవీ రీసెంట్ గా హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. మొరాకో దేశం లో జరిగే ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ తో "వాలిమై " మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది.
మెగా ప్రిన్స్ 'గని'
మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఎప్పుడూ డిఫరెంట్ గా సినిమాలు చేయడానికి ఇష్టపడతాడన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా కాస్త అటు ఇటు అయినా ఆ తర్వాత కంచె సినిమాతో ప్రత్యేక గుర్తింపు పొండాదు. ఆ తర్వాత తొలిప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్, ఎఫ్2 ఇలా వరుస హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు.
బిజీగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి
“ఎవరే అతగాడు” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “పరుత్తి వీరన్ “తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పలు భాషల మూవీస్ తో ప్రియమణి బిజీగా ఉన్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి ప్రస్తుతం 4తెలుగు , 3 కన్నడ , ఒక హిందీ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు.
హైదరాబాద్ టు ముంబై
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలకు జంటగా నటిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ , “రాధేశ్యామ్ “మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ , బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం?
లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు మనవడు , హీరో హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ “బాలగోపాలుడు “మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.సూపర్ హిట్ “అతనొక్కడే “, “హరే రామ్ “, “పటాస్ “, “118” మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “NTR 30 ” మూవీ ని నిర్మించనున్నారు.
'రాధే శ్యామ్' టీం కు ప్రభాస్ గిఫ్ట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెట్స్ లో ఉన్న వాళ్ళని ఎలా చూసుకుంటాడో ఆయనతో పనిచేసిన చాలా మంది ఎన్నో సందర్భాల్లో చెప్పారు మనం కూడా విన్నాం. ఇంటినుండి వండించుకొని మరీ అందరికీ భోజనం పెడుతుంటాడు. గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ఇక ఇప్పుడు రాధే శ్యామ్ టీం కు కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ ఆజానుబాహుడు.

"తలైవి " స్పెషల్ పోస్టర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి” మూవీకి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.
నటి కావాలని కలలు కన్నా- అదితి రావు హైదరి
అదితి రావు హైదరి “ప్రజాపతి “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్న “శృంగారం”మూవీ లో దేవదాసి పాత్రలో నటించి అదితి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఢిల్లీ -6″మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బాలీవుడ్ లో బిజీగా మారిన అదితి 10 సంవత్సరాల తరువాత మణి రత్నం దర్శకత్వంలో రూపొందిన "కాట్రు వెళియిదై " (చెలియా ) మూవీ తో కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. మణిరత్నం గారితో పనిచేయడం వల్ల ఎంతో పరిణతి సాధించాననీ , మణిరత్నం గారి ఇన్ స్పిరేషన్ తో మూవీస్ ఎంపిక చేసుకుంటున్నాననీ, నటి కావాలనే తన కలలు నెరవేరాయనీ అదితి చెప్పారు.
ఆచార్య - 'సిద్ధ' గా చెర్రీ
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
నిర్మాత 'దొరస్వామి' కి రాజమౌళి సంతాపం
సీనియర్ నిర్మాత వి.దొరస్వామి రాజు ఈ రోజు కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో... అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కాగా వి.దొరస్వామి రాజు మృతికి జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు.
'లైగర్' గా రౌడీ హీరో
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. ఇక కరోనా వల్ల ఇన్నిరోజులు బ్రేక్ తీసుకోగా ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదని ఇప్పటినే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైటర్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. అసలైన టైటిల్ వేరే ఉందని ఇంతకుముందే తెలిపింది.
"RED" మూవీ సక్సెస్ మీట్ లో మాళవిక శర్మ
స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
లాభాల బాటలో "అల్లుడు అదుర్స్ "
రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.