గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బంగారు బుల్లోడు’. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ ను చూస్తుంటే పాత అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. ఎప్పటిలాగే ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఎండకు అమ్మాయి కాళ్లు కాలుతున్నాయని నరేష్ అక్కడే ఉన్న బిందెను తన్నడం, తీరా అది వేడి నీళ్ల గిన్నె అని తెలియడం వంటి సీన్లు బాగున్నాయి. గుడిలో పులిహోరలాగా అమ్మాయి ఫ్రెష్‌గా ఉందని వెన్నెల కిషోర్ పెళ్లి సంబంధం కోసం తాపత్రయ పడటం లాంటి సన్నివేశాలు నవ్వు తెప్పిస్తున్నాయి. మరి ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది.. సినిమాలో ఇంకెంత కామెడీ ఉందో చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Presenting to you the trailer of #BangaruBullodu … fun and laughs all the way just for you!https://t.co/vIzuldi1ow#BangaruBulloduonJan23rd @IamPoojaJhaveri @GiriPalika @AnilSunkara1@kishore_Atv @aj_sunkara @ImSaiKartheek @AKentsOfficial
— Allari Naresh (@allarinaresh) January 19, 2021
కాగా పూజా ఝవేరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, సత్యం రాజేశ్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘నాంది’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే నాంది సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























