#NS23 నుండి క్రేజీ అప్ డేట్

#NS23 Movie Team Comes Up With A Crazy Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Shaurya Movie Update,Naga Shaurya New Movie News,Naga Shaurya Latest Movie Details,Naga Shaurya New Film Update,NS23,NS23 Movie Team Comes Up With Update,NS23 Movie Update,NS23 Update,Director Raja,Naga Shaurya,Actor Naga Shaurya,Hero Naga Shaurya,NS23 Title Announcement,NS23 Title Poster,NS23 Title,NS23 Title Poster Update,NS23 Announcement,NS23 Announced,NS23 Movie Latest Update,#NS23

నేటి తరం హీరోల్లో నాగ శౌర్య తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని వైవిధ్యమైన నటనను కనబరుస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, కళ్యాణ్ వైభోగమే,ఛలో, అశ్వద్ధామ ఇలా పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు నాగశౌర్య.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా నాగ శౌర్య కూడా ఒక సినిమా తర్వాత మరొక సినిమాను లైన్ లో పెడుతున్నాడు. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘లక్ష్య’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ ఇటీవలే చేయగా అందులో నాగశౌర్య లుక్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 8ప్యాక్ తో నాగ శౌర్య మంచి కండరాలు తిరిగిన బాడీ తో మునుపెన్నడూ లేనంతగా ఈ సినిమాలో కనిపించనున్నాడు.

ఇది కాకుండా నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ చిత్ర యూనిట్ నుండి క్రేజీ అప్ డేట్ వచ్చింది. రేపు నాగశౌర్య పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. సాయంత్రం 5.4 నిమిషాలకు టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు.

దీనితో పాటు పలు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. వరుడు కావలెను అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 6 =