
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 23


"గమనం " మూవీ ప్రెస్ మీట్

మెగా అల్లుడి మరో కొత్తసినిమా

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ పూర్తి చేసుకున్న అనుపమ

'చిరు' కి విలన్ గా మాధవన్..!

సూపర్ స్టార్ కృష్ణ రిటైర్ మెంట్

షూటింగ్ మొదలుపెట్టిన 'బిచ్చగాడు2'

త్రి భాషా చిత్రంలో కీర్తి సురేష్

శృతి హాసన్ ఎయిర్ పోర్ట్ లుక్

ఎన్టీఆర్ పై సుధీర్ బాబు ప్రశంసలు

"వరుడు కావలెను "మూవీ టీజర్ రిలీజ్ డేట్

అల్లు అర్జున్ గురించి హన్సిక ఒక్క మాటలో

లక్కీ హీరోయిన్ పూజాహెగ్డే

నాగార్జున కు చిరంజీవి బర్త్ డే విషెస్

లాక్ డౌన్ కాన్సెప్ట్ తో విశ్వక్ సేన్ మూవీ

యాక్షన్ సీన్ లో కాజల్
50 వసంతాల "కౌబాయ్"

ఫైనల్లీ షారుఖ్-అట్లీ సినిమా షురూ
ఒకప్పుడు బాలీవుడ్ బాద్ షా లాగ బాలీవుడ్ ను ఏలిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు కాస్త వెనుకబడ్డాడు. వరుస ఫ్లాపులు రావడంతో ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి సౌత్ డైరెక్టర్ ను నమ్ముకున్నాడు. అట్లీ ర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుందనే టాక్ గత రెండేళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేశారు మేకర్స్. ఫైనల్లీ ఎప్పటినుండో అనుకుంటున్న షారుఖ్-అట్లీ ఇన్ని రోజులకు పట్టాలెక్కింది.

"గమనం " మూవీ ప్రెస్ మీట్
క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ , కాళి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుజనా రావు దర్శకత్వంలో శ్రియ , నిత్య మీనన్ , శివ కందుకూరి , ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆంథాలజీ మూవీ "గమనం" తెరకెక్కింది. సుహాస్ , బిత్తిరి సత్తి , రవి ప్రకాష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయ రాజా సంగీతం అందించారు. "గమనం" చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రియ , ప్రియాంక జవాల్కర్, సాయిమాధవ్ బుర్రా, డైరెక్టర్ సుజన, ప్రొడ్యూసర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

పూల రాశి
తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ , 3 వెబ్ సిరీస్ లతో అందాల రాశీఖన్నా బిజీగా ఉన్నారు. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ (మలయాళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. షూటింగ్స్ కై రాశీఖన్నా ముంబై , చెన్నై , హైదరాబాద్ ప్రయాణాలతో బిజీగా ఉన్నారు.

మెగా అల్లుడి మరో కొత్తసినిమా
టాలీవుడ్ లో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ మరీ మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ దేవ్ లిస్ట్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉన్నాయి. పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన 'సూపర్ మచ్చి' సినిమా రిలీజ్ అవ్వాలి. అశ్వద్ధామ ఫేమ్ రమణ తేజ కాంబినేషన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ పూర్తి చేసుకున్న అనుపమ
దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఆతరువాత ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల కుదరలేదు. ఫైనల్ గా ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి అయితే మంచి రెస్పాన్సే వచ్చింది.

'చిరు' కి విలన్ గా మాధవన్..!
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ గా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు డైరెక్టర్ మోహన్ రాజా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

సూపర్ స్టార్ కృష్ణ రిటైర్ మెంట్
"తేనె మనసులు"(1965 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుమారు 350 సినిమాలలో నటించిన కృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారు. విశేష అభిమానులు ఉన్న హీరో కృష్ణ ఫస్ట్ కలర్ ఫిల్మ్ , ఫస్ట్ 70 ఎమ్ ఎమ్ వంటి పలు నూతన అధ్యాయాలకు ఆద్యుడు ఆయ్యారు. నటుడు , నిర్మాత , దర్శకుడిగా ఐదు దశాబ్దాలుగా కళామతల్లి కి సేవలందించిన హీరో కృష్ణ ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

షూటింగ్ మొదలుపెట్టిన 'బిచ్చగాడు2'
విజయ్ ఆంటోని సినిమాలు కాస్త వైవిధ్యంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా. అందుకే కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది.

త్రి భాషా చిత్రంలో కీర్తి సురేష్
తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి ఇప్పుడు ఒక త్రి భాషాచిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

బోయపాటి , రామ్ మూవీ అప్ డేట్
బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. హీరో రామ్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ లో నటిస్తున్నారు.

శృతి హాసన్ ఎయిర్ పోర్ట్ లుక్
మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన "క్రాక్ ", "వకీల్ సాబ్"మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న "సలార్"మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "సలార్"మూవీ కై శృతి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి , శృతి జంటగా తెరకెక్కిన "లాభం "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఎన్టీఆర్ పై సుధీర్ బాబు ప్రశంసలు
సక్సెస్ ఫుల్ "పలాస 1978 " మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా రూపొందిన "శ్రీదేవి సోడా సెంటర్ " మూవీ సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. "శ్రీదేవి సోడా సెంటర్ " మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు విడుదలకు ముందు నుండి విడుదల అయిన తర్వాత కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"వరుడు కావలెను "మూవీ టీజర్ రిలీజ్ డేట్
సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ"వరుడు కావలెను "మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అల్లు అర్జున్ గురించి హన్సిక ఒక్క మాటలో
దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 2007లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక మొదటి సినిమాతోనే హన్సిక ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ఆతరువాత స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. కేవలం తెలుగు లోనే కాదు తమిళ్ లో కూడా హన్సిక వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే ఈమధ్య తెలుగులో కాస్త సినిమాలు తగ్గిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండా తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన హన్సిక పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తను మొదట నటించిన హీరో అల్లు అర్జున్ గురించి ఒక మాటలో చెప్పమని…

లక్కీ హీరోయిన్ పూజాహెగ్డే
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “ , “ఆచార్య “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ మూవీస్ సల్మాన్ ఖాన్ “భాయిజాన్”, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.

నాగార్జున కు చిరంజీవి బర్త్ డే విషెస్
సక్సెస్ ఫుల్ "విక్రమ్ "(1986) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున మూడున్నర దశాబ్దాలుగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. "అన్నమయ్య ", శ్రీరామదాసు ", "షిర్డీ సాయి ", "జగద్గురు ఆది శంకర "వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 100సినిమాలకు పైగా హీరోగా నటించిన నాగార్జున బెస్ట్ యాక్టర్ గా 9నంది , 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. వయసు మీద పడుతున్నా నాగార్జున యంగ్ గా కనపడుతూ , యాక్టివ్ గా మూవీస్ లో నటించడం విశేషం. ఆగష్టు 29 వ తేదీ నాగ్గార్జున తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు.

లాక్ డౌన్ కాన్సెప్ట్ తో విశ్వక్ సేన్ మూవీ
"పాగల్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ కొత్త మూవీ షూటింగ్ ఆగస్ట్ 16 వ తేదీ లాంఛనంగా ప్రారంభం అయ్యింది. బివిఎస్ ఎన్ ప్రాసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా"అశోకవనంలో అర్జున కళ్యాణం" మూవీ తెరకెక్కుతుంది. టైటిల్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో విశ్వక్ సేన్ ఇప్పటి వరకూ యూత్ , మాస్ ఆడియన్స్ను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశ్వక్ ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించనున్నారు.

యాక్షన్ సీన్ లో కాజల్
వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతుంది. ఒక షూటింగ్ షెడ్యూల్ గోవా లో కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ లో బిజీగా ఉన్న కాజల్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

'విశాల్ 31' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
శరవణన్ దర్శకత్వంలో విశాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘విశాల్ 31’ అనే వర్కింగ్ టైటిల్‌తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ సినిమా సెట్లోనే విశాల్ కు గాయమైంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని మేకర్స్ తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. రేపు “విశాల్ 31” ఫస్ట్ లుక్, టైటిల్ ను వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్‌లో అనౌన్స్ చేస్తూ విశాల్ పోస్టర్‌ని…
50 వసంతాల "కౌబాయ్"
పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ , విజయ నిర్మల జంటగా ఇంగ్లీష్ మూవీస్ ఇన్ స్పి రేషన్ తో రూపొందిన "మోసగాళ్ళకు మోసగాడు "మూవీ 1971 సంవత్సరం ఆగష్టు 27 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది . తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ కౌ బాయ్ మూవీ , ఫస్ట్ కలర్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగభూషణం , గుమ్మడి , కైకాల , ప్రభాకరరెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. పి. ఆదినారాయణ రావు సంగీతం అందించారు. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్స్ ఇంగ్లిష్ , హిందీ , తమిళ భాషలలో రిలీజ్ అయ్యాయి.