క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ , కాళి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుజనా రావు దర్శకత్వంలో శ్రియ , నిత్య మీనన్ , శివ కందుకూరి , ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆంథాలజీ మూవీ “గమనం” తెరకెక్కింది. సుహాస్ , బిత్తిరి సత్తి , రవి ప్రకాష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయ రాజా సంగీతం అందించారు. “గమనం” చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రియ , ప్రియాంక జవాల్కర్, సాయిమాధవ్ బుర్రా, డైరెక్టర్ సుజన, ప్రొడ్యూసర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ..” గమనం” సినిమా చాలా ప్రత్యేకమైన సినిమా అనీ , .ఈ కథ చెప్పినప్పుడే ఈ సినిమాకి డైలాగ్స్ రాయాలని అనిపించిందనీ , డైరెక్టర్ సృజనగారి గురించి చెప్పాలంటే సినిమా ప్రతి ఫ్రేమ్‌లో తన తపన కనిపిస్తుంది. ఆమె ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయనీ చెప్పారు. డైరెక్టర్ సృజన మాట్లాడుతూ.. ‘‘ఇళయరాజాగారు, సాయిమాధవ్‌గారు, బాబా గారు, శ్రియ గారు.. వంటి పెద్ద పెద్ద వాళ్ళతో “గమనం ” మూవీ ని చేయటం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాననీ , ఏ కథ చెప్పినా కానీ దానికి ఒక మోరల్ ఉండాలనీ , అలాంటి కథనే మా ఈ “గమనం”అనీ, అందరికీ థాంక్స్’’ అని చెప్పారు.శ్రియ మాట్లాడుతూ.. థ్యాంక్యూ సృజన, “గమనం” కథ సృజన హార్ట్ నుంచి వచ్చిందనీ , “గమనం”సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందనీ ,తనకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాననీ , ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుందనీ చెప్పారు. ఇంకా శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ తమ పాత్రల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: