ఒకప్పుడు బాలీవుడ్ బాద్ షా లాగ బాలీవుడ్ ను ఏలిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు కాస్త వెనుకబడ్డాడు. వరుస ఫ్లాపులు రావడంతో ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి సౌత్ డైరెక్టర్ ను నమ్ముకున్నాడు. అట్లీ ర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుందనే టాక్ గత రెండేళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేశారు మేకర్స్. ఫైనల్లీ ఎప్పటినుండో అనుకుంటున్న షారుఖ్-అట్లీ ఇన్ని రోజులకు పట్టాలెక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండా ఈసినిమాలో హీరోయిన్స్ గా నయనతార, ప్రియమణి నటిస్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్ పక్కన నయనతార నటిస్తుండగా.. ప్రియమణి మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఈనేపథ్యంలో వీరిద్దరూ ఈరోజు షూటింగ్ నిమిత్తం పూణే చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్.
కాగా మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాకు సాంకీ అనే టైటిల్ ను కూడా అనుకున్నట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను షారుఖ్ తన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తుండగా.. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: