పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ , విజయ నిర్మల జంటగా ఇంగ్లీష్ మూవీస్ ఇన్ స్పి రేషన్ తో రూపొందిన “మోసగాళ్ళకు మోసగాడు “మూవీ 1971 సంవత్సరం ఆగష్టు 27 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది . తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ కౌ బాయ్ మూవీ , ఫస్ట్ కలర్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగభూషణం , గుమ్మడి , కైకాల , ప్రభాకరరెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. పి. ఆదినారాయణ రావు సంగీతం అందించారు. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్స్ ఇంగ్లిష్ , హిందీ , తమిళ భాషలలో రిలీజ్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మోసగాళ్ళకు మోసగాడు “మూవీ 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ ఆ మూవీ విశేషాలను తెలిపారు. కృష్ణ మాట్లాడుతూ.. ‘పద్మాలయ సంస్థ నిర్మించిన రెండో సినిమా “మోసగాళ్లకు మోసగాడు”మూవీ అనీ , “గుడ్ బాడ్ అగ్లీ” , “మెకన్నాస్ గోల్డ్” మూవీస్ ఇన్ స్పి రేషన్ తో రైటర్ ఆరుద్ర కథ తయారు చేశారనీ , కె ఎస్ ఆర్ దాస్ ను దర్శకుడిగా ఎంపిక చేశామనీ , ఈ మూవీ ని రాజస్థాన్ లో తీయాలని నిర్ణయించామనీ , ఆ సమయంలో కలర్ లో సినిమా తీయడమంటే ఖర్చుతో కూడుకున్న పని అయినా రిస్క్ చేసి కలర్ లో తీశామనీ , రాజస్థాన్ లో షూటింగ్ సమయం లో అనేక కష్టాలు ఎదురయ్యాయనీ ,తాను ఎక్కిన గుర్రం రెండుసార్లు పడేసిందనీ , ఆ తరువాత దానిని మచ్చిక చేసుకొని షూటింగ్ కొనసాగించామనీ , అలా రాజస్థాన్ లో షూటింగ్ పూర్తి చేసుకొని సిమ్లాకు వెళ్ళామనీ , ఎన్టీఆర్ ఈ సినిమా చూసి బాగా తీశావ్ బ్రదర్ కాకపోతే లేడీస్ ప్రేక్షకులను రానీయకుండా చేశావ్ అని అన్నారనీ , అయితే ఎన్టీఆర్ చెప్పిన విధంగా సినిమా ఎక్కువ రోజులు ఆడలేదు. కానీ మేము అనుకున్న బడ్జెట్ మాత్రం వచ్చిందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: