విజయ్ ఆంటోని సినిమాలు కాస్త వైవిధ్యంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా. అందుకే కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమా వస్తున్నట్టు విజయ్ ఆంటోని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా నుండి పలు పోస్టర్లు కూడా రిలీజ్ చేశాడు. ఇక తాజాగా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం చెన్నైలో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
కాగా ఈ మూవీలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈసినిమాను 2022లో విడుదల చెయ్యనున్నారు. మరి ఇప్పటికే యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా అలరించిన విజయ్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారారు.. మరి డైరెక్టర్ గాఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: