
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 22


'RC 15' రెగ్యులర్ షూట్ కు డేట్ ఫిక్స్..!

సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

తేజ సినిమాపై గోపీచంద్ క్లారిటీ

అదితి రావు హైదరి శారీ లుక్

ముగింపు దశలో "విరాటపర్వం"

"అందాల రాక్షసి"లావణ్య త్రిపాఠి

రవితేజ న్యూ మూవీ అప్ డేట్

ప్రభాస్ తో మళ్ళీ నటించాలని ఉంది..!

సమంత షాకింగ్ లుక్

మరో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ
'ఐకాన్' ప్రారంభానికి సన్నాహాలు

నాగచైతన్య 12ఇయర్స్ సినీ జర్నీ

సమంత గోవా ట్రిప్

"రొమాంటిక్ " మూవీ సెన్సార్ పూర్తి

హీరో నాని 13 ఇయర్స్ సినీ జర్నీ

కార్తీ కి హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు

6 సంవత్సరాల "భలే భలే మగాడివోయ్"

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి

'రాధేశ్యామ్' షూటింగ్ అప్ డేట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' కూడా ఉంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా ఇటీవలే లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. జమ్మలమడుగు గండికోటలో ఈసినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా జరుపుకుంటుండగా ఇప్పుడు దాదాపు షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది

"18 పేజెస్" అనుపమ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన “18 పేజెస్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'RC 15' రెగ్యులర్ షూట్ కు డేట్ ఫిక్స్..!
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను లాంఛనంగా ప్రారంభించారు కూడా. ఇక ఇన్ని రోజులు చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు చరణ్. దీంతో త్వరలోనే శంకర్ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతుందనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. RC15 మూవీ షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం…

సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం
హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు . కేబుల్ బ్రిడ్జి-ఐకియా రూట్‌లో ప్రమాదం జరిగింది. సాయిధరమ్ నడుపుతున్న స్సోర్ట్స్ బైక్ స్కిడ్ అయి జారీ పడింది. వేగంగా వస్తుండడంతో ఒక్కసారిగా స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను పైన, ఛాతి, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను మెడికవర్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

తేజ సినిమాపై గోపీచంద్ క్లారిటీ
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ , తమన్నా కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా చేస్తుండగానే తేజ తో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాకు అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి ప్రకటించారు. అయితే ఆతరువాత ఈసినిమా గురించి పెద్దగా ఎక్కడా వినిపించలేదు.

అదితి రావు హైదరి శారీ లుక్
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా రూపొందిన "ప్రజాపతి "మూవీ తో కెరీర్ ప్రారంభించిన అదితి రావు హైదరి , " శృంగారం "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఢిల్లీ 6 "మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. పలు సూపర్ హిట్ హిందీ , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అదితి, సక్సెస్ ఫుల్ "సమ్మోహనం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి , ఆ మూవీలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "V"మూవీ లో సాహెబా పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అదితి ప్రేక్షకులను అలరించారు.

ముగింపు దశలో "విరాటపర్వం"
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫిలిమ్స్ , సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సలైట్ మూవ్ మెంట్స్ నేపథ్యం లో పీరియాడికల్ డ్రామా "విరాట పర్వం "తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి, నందిత దాస్ , నివేత పేతురాజ్ , నవీన్ చంద్ర, సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

"అందాల రాక్షసి"లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. 2021 సంవత్సరం "A1 ఎక్స్ ప్రెస్ ", "చావు కబురు చల్లగా " మూవీ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రవితేజ న్యూ మూవీ అప్ డేట్
బ్లాక్ బస్టర్ "క్రాక్ " మూవీ తో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజరవితేజప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ రెండు మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్ తో మళ్ళీ నటించాలని ఉంది..!
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. ఇక ఇంత రేంజ్ ఉన్న హీరోతో సినిమా చేయాలని ఏ హీరోయిన్ కు మాత్రం ఉండదు చెప్పంది. ప్రతి ఒక్కరూ అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా ప్రభాస్ తో నటించాలని ఉందని చెప్పింది. అయితే మాములు హీరోయిన్ అయితే వేరేలా ఉండేది కానీ బాలీవుడ్ క్వీన్ కంగనా లాంటి హీరోయిన్ చెప్పడం అంటే మాత్రం నిజంగా ఆసక్తికరమైన విషయమే.

సమంత షాకింగ్ లుక్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”, "కాతు వాకుల రెండు కాదల్ "తమిళ మూవీ లో నటిస్తున్నారు. " శాకుంతలం" మూవీ లో శకుంతలగా నటించినందుకు సమంత ఆనందం వ్యక్తం చేశారు.

మరో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్"లో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక. 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న "లైగర్" మూవీ షూటింగ్ గోవా లో నెల రోజుల పాటు జరగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. గోవాలో చిత్రీకరణ పూర్తయిన తర్వాత విదేశాల్లో ఒక షెడ్యూల్ చేయనున్నారనీ , విజయ్ దేవరకొండకు, విదేశీ బాక్సర్లకు మధ్య కొన్ని సన్నివేశాలను ఫారిన్ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తారని సమాచారం .
'ఐకాన్' ప్రారంభానికి సన్నాహాలు
బన్నీ ఐకాన్.. ఈసినిమా ఇప్పటి వరకూ ప్రారంభంకాలేదు కానీ.. ఏదో ఒక వార్తలతో మాత్రం ఎప్పుడూ ఫోకస్ లోనే ఉంటుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఇక ఈమధ్య కాలంలో అయితే అసలు ఈసినిమా అల్లు అర్జున్ చేయట్లేదని.. ఆగిపోయిందని కూడా అనుకున్నారు అందరూ. వార్తలకు తగ్గట్టూ ఎవరూ స్పందించకపోవడంతో నిజంగానే సినిమా అటకెక్కిందేమో అనుకున్నారు. కానీ నిర్మాత బన్నీ వాసు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బన్నీ పుష్ప తరువాత ఈ సినిమానే చేస్తున్నాడు అని చెప్పడంతో క్లారిటీ వచ్చింది.

నాగచైతన్య 12ఇయర్స్ సినీ జర్నీ
కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య "జోష్"(2009) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "ఏ మాయ చేసావె " మూవీ తో నాగచైతన్య విజయం సాధించారు. "ఏ మాయ చేసావె " మూవీ తో సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నాగచైతన్య తన ఫస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ హీరోయిన్ సమంత ను వివాహం చేసుకొనడం విశేషం. "100% లవ్ ", "తడాఖా ", "మనం", "ఒక లైలా కోసం", "ప్రేమమ్", "రారండోయ్ వేడుక చూద్దాం ", "మజిలీ", "వెంకీ మామ" వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగచైతన్య ప్రేక్షకులను అలరించారు.

సమంత గోవా ట్రిప్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత తన ఫ్రెండ్స్ తో గోవా వెళ్ళారు.

"రొమాంటిక్ " మూవీ సెన్సార్ పూర్తి
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి , కేతిక శర్మ జంటగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "రొమాంటిక్ " మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించగా మందిరా బేడి , మకరంద్ దేశ్ పాండే , దివ్య దర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. గోవా లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న "రొమాంటిక్ " మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించడం విశేషం.

హీరో నాని 13 ఇయర్స్ సినీ జర్నీ
"ఢీ ", "రాధాగోపాలం" మూవీస్ కు దర్శకత్వ శాఖ లో పనిచేసిన నాని , మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ "అష్టా చమ్మా" మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "అష్టా చమ్మా" మూవీ 2008 సంవత్సరం సెప్టెంబర్ 5 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "రైడ్", భీమిలి కబడ్డి జట్టు" వంటి మూవీస్ తో నాని ప్రేక్షకులను అలరించారు. "అలా మొదలైంది"."పిల్ల జమీందార్" విజయం సాధించడంతో నాని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ "ఈగ "మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కార్తీ కి హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు
తమిళ్ స్టార్ హీరో కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈసినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించగా... విరుమన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. దీనితో పాటు ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు సూర్య. ఆసక్తికరమైన విషయం ఏంటంటేఇక ఈసినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరంటే డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితీ శంకర్. అదితీ శంకర్ హీరోయిన్ గా ఈసినిమాతో అరంగేట్రం చేయనుంది.

6 సంవత్సరాల "భలే భలే మగాడివోయ్"
GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో నాని , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “భలే భలే మగాడివోయ్ ” మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మురళీశర్మ , నరేష్ , సితార , అజయ్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. హీరో నాని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, మతిమరుపు నేపథ్యంలో కొన్ని విచిత్ర పరిస్థితుల్లో అతడిచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ అద్భుతంగా పండాయి. హీరో నాని , లావణ్య త్రిపాఠి ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ ను సాయి పల్లవి కంప్లీట్ చేశారు.