టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “ , “ఆచార్య “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ మూవీస్ సల్మాన్ ఖాన్ “భాయిజాన్”, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో రూపొందిన 7వ చిత్రాలు “సింహాద్రి”, “ఒక్కడు”, “ఖుషి ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడు బ్లాక్ బస్టర్ మూవీస్ లో భూమిక కథానాయికగా నటించారు. అలాంటి అరుదైన అవకాశం పూజాహెగ్డే దక్కించుకున్నారు. ఎన్టీఆర్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన ఎన్టీఆర్ 28వ సినిమా “అరవింద సమేత`వీర రాఘవ ” ఘనవిజయం సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ 28వ మూవీ లో పూజాహెగ్డే కథానాయిక. హరీష్ శంకర్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న “#PSPK 28” మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే ని లక్కీ హీరోయిన్ అనడంలో సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: