“తేనె మనసులు”(1965 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుమారు 350 సినిమాలలో నటించిన కృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారు. విశేష అభిమానులు ఉన్న హీరో కృష్ణ ఫస్ట్ కలర్ ఫిల్మ్ , ఫస్ట్ 70 ఎమ్ ఎమ్ వంటి పలు నూతన అధ్యాయాలకు ఆద్యుడు ఆయ్యారు. నటుడు , నిర్మాత , దర్శకుడిగా ఐదు దశాబ్దాలుగా కళామతల్లి కి సేవలందించిన హీరో కృష్ణ ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని ప్రయత్నాలను ధైర్యం గా చేస్తూ హీరో కృష్ణ డేరింగ్ , డాషింగ్ హీరో గా పేరుపొందారు. హీరో గా సినిమాలకు దూరం అయినా కృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. 2016 “శ్రీ శ్రీ ” మూవీ లో చివరి సారిగా కృష్ణ నటించారు. హీరో కృష్ణ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తన కెరీర్ పట్ల ఎంతో ఆనందంగా , సంతోషంగా ఉన్నాననీ , ఇంతకాలం సినిమాలలో నటించడం తన అదృష్టమని , ఇక పై వెండి తెర పై ఎటువంటి పాత్రలోనూ నటించననీ హీరో కృష్ణ స్వయంగా రిటైర్ మెంట్ ప్రకటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























