
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 12


కేతిక శర్మ స్టైలిష్ లుక్

బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభం

సినిమాటోగ్రాఫర్ కు భీమ్లా నాయక్ థ్యాంక్స్

'రాధేశ్యామ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

ఇలియానా చేతిపై ఉన్న టాటూ కి అర్ధం

శ్రీలీల బ్యూటీఫుల్ లుక్

19 ఇయర్స్ ప్రభాస్ సినీ జర్నీ

కామెడీ పాత్రలు చేయాలని ఉంది

"దృశ్యం 2 " మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్

బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ టాలీవుడ్ ఎంట్రీ

హిందీలో ఆ ఛాన్స్ రానందుకు ఫీల్ అయ్యా..!

పాన్ ఇండియా మూవీపై హీరో నాని అభిప్రాయం

విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరో

సీనియర్ అభిమానితో జూనియర్ ఎన్టీఆర్..!

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్

"మాచర్ల నియోజకవర్గం " మూవీ రిలీజ్ డేట్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్యాథరీన్ మరో కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.వినాయక చవితి పండగ రోజు “మాచర్ల నియోజకవర్గం” మూవీ షూటింగ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ తో ప్రారంభం అయ్యింది. అదే రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం”…

కేతిక శర్మ స్టైలిష్ లుక్
యంగ్ హీరో ఆకాష్ పూరి, మోడల్ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో ,మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతూ డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. కేతిక కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభం
నటసింహా నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేనితో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే గోపీచంద్ బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.

"లైగర్ " మూవీ కై ఎదురుచూస్తున్నా -దుల్కర్ సల్మాన్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ లో హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ…

సినిమాటోగ్రాఫర్ కు భీమ్లా నాయక్ థ్యాంక్స్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'రాధేశ్యామ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఒక సినిమా తరువాత మరొక సినిమా పూర్తవుతున్నాఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇందులో ఫస్ట్ లిస్ట్ లో ఉన్న సినిమా రాధేశ్యామ్. రాాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. దానికి తోడు అప్ డేట్స్ కూడా చాలా తక్కువగానే వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందుతూనే ఉన్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా నుండి అప్ డేట్ వచ్చింది. నిజానికి…

స్పీడు పెంచుతున్న శిరీష్.. 7వ సినిమాకు గ్రీన్ సిగ్నల్..!
అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ మొదట్లో చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే చేసేవాడు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ ఎక్కువగానే వచ్చింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చాడు మళ్లీ ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. ఇప్పటికే అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇలియానా చేతిపై ఉన్న టాటూ కి అర్ధం
బ్లాక్ బస్టర్ "దేవదాసు "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో కెరీర్ పీక్ లో ఉండగా ఇలియానా సూపర్ హిట్ "బర్ఫీ "మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలుసూపర్ హిట్ మూవీస్ తో ఇలియానా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. ఇలియానా ప్రస్థుతం రెండు హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు..

శ్రీలీల బ్యూటీఫుల్ లుక్
కన్నడ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తూనే మెడికల్ డిగ్రీ చేశారు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరి రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన “పెళ్ళిసందD ” మూవీ తో టాలీవుడ్ కు శ్రీలీల కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో శ్రీలీల తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “పెళ్ళిసందD ” మూవీ భారీ వసూళ్ళను రాబట్టి దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.

19 ఇయర్స్ ప్రభాస్ సినీ జర్నీ
"ఈశ్వర్ "(2002) మూవీ తో ప్రభాస్ టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "వర్షం" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "ఛత్రపతి ", "బిల్లా", "డార్లింగ్", "Mr పర్ ఫెక్ట్" , " మిర్చి " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "బాహుబలి", "బాహుబలి 2" మూవీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళని రాబట్టాయి . హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. "బాహుబలి " మూవీ ఇండియన్ సినీ చరిత్రలో గ్రేట్ మూవీ గా నిలిచి ప్రభాస్ కు కెరీర్ టర్నింగ్…

కామెడీ పాత్రలు చేయాలని ఉంది
ఎన్ని సినిమాలు చేసినా ప్రతి హీరోకు హీరోయిన్ కు కొన్ని స్పెషల్ రోల్స్ లో చేయాలని.. పలానా జోనర్ లో చేయాలని ఉంటుంది. ఇక్కడ టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా అదే చెబుతుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తనకు కామెడీ పాత్ర చేయాలని ఉందని.. ఒక సినిమాలో పూర్తి స్థాయిలో కామెడీ పండించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని చెబుతుంది. మరి సాయి పల్లవి కోరిక ఏ డైరెక్టర్ నెరవేరుస్తాడో.. ఆమె కోసం మంచి కామెడీ రోల్ ఎవరు రాస్తారో చూద్దాం.

"దృశ్యం 2 " మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్
శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ "దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ దృశ్యం 2″ మూవీ రూపొందింది.

బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ టాలీవుడ్ ఎంట్రీ
"ఖ్వాహిష్ "(2003 ) మూవీ తో మల్లికా షెరావత్ బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు బాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను మల్లిక అలరించారు. పలు స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మల్లిక ఇంగ్లీష్ , చైనీస్ మూవీస్ లో నటించారు."ఈ ప్రీతి ఏకే భూమి మెలిడే "మూవీ తో శాండల్ వుడ్, "దశావతారం"మూవీ తో కోలీవుడ్ కు మల్లిక పరిచయం అయ్యారు. మల్లిక ఇప్పుడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.

ప్రతీ రోజూ కొత్త విషయాన్ని నేర్చుకొంటా - శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

హిందీలో ఆ ఛాన్స్ రానందుకు ఫీల్ అయ్యా..!
తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్టయింది. ఈ ఒక్క సినిమాతో కార్తికేయ, పాయల్, డైరెక్టర్ అజయ్ భూపతి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతంముగ్గురు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.

పాన్ ఇండియా మూవీపై హీరో నాని అభిప్రాయం
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో నాని ప్రస్తుతం "అంటే .. సుందరానికీ ! మూవీ లో నటిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరో
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ లో నటిస్తున్నారు. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.

సీనియర్ అభిమానితో జూనియర్ ఎన్టీఆర్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చిన్న వాళ్ల దగ్గరనుండి పెద్ద వాళ్ల వరకూ ఫ్యాన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా తాత పోలికలు పుణికి పుచ్చుకోవడంతో పెద్దవాళ్లు కూడా ఎన్టీఆర్ ను ఎంతో అభిమానిస్తుంటారు. ఈనేపథ్యంలోనే ఒక సీనియర్ అభిమాని ఎన్టీఆర్ ను కలిసింది. ఎన్టీఆర్ తో ఓ బామ్మగారు దిగిన ఫొటో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను చూసిన ఆమె సంతోషంతో.. ఆయనను హత్తుకుని ఫొటో దిగింది.

52 వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథి గా సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు.సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు.

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా సాయి తేజ్ ప్రమాదానికి గురికావడం తో పోస్ట్ పోన్ అయ్యింది. సాయితేజ్ కోలుకోవడం తో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .