
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 11


అందం అంటే .. - కృతిశెట్టి

అభిమానికి ఖరీదైన బహుమతి ఇచ్చిన 'ప్రభాస్'

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు

మాల్దీవ్స్ లో పూజాహెగ్డే ఎంజాయ్

టాలీవుడ్ కమెడియన్స్ పార్టీ

'ఎన్టీఆర్' 21 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాత్రలు

'దృశ్యం 2' ట్రైలర్ రిలీజ్

మలయాళం సినిమాలో మంచు లక్ష్మీ

'స్కైలాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్

'గని' టీజర్ రిలీజ్

'అఖండ' ట్రైలర్ రిలీజ్

'అఖండ' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

'లైగర్' కోసం రెడీ అవుతున్న మైక్ టైసన్

పూజాహెగ్డే ఫిట్ నెస్ సీక్రెట్

'గని' ఈశ్వర్ నాథ్ గా జగపతిబాబు

రాశీఖన్నా బాలీవుడ్ రీఎంట్రీ
సూపర్ హిట్ "మద్రాస్ కేఫ్ "(2013 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

అందం అంటే .. - కృతిశెట్టి
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో టాలీవుడ్ కు కృతి శెట్టి కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో కృతి శెట్టి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్అందుకుంటున్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్” మూవీ లో కృతిశెట్టి ముగ్గురు కథానాయికలలో ఒకరిగా నటించారు. ఆ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. .

అభిమానికి ఖరీదైన బహుమతి ఇచ్చిన 'ప్రభాస్'
తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక హీరో పై అభిమానం పెంచుకున్నారంటే చాలు అది అంత ఈజీగా పోదు. అంతేకాదు కొంతమంది అభిమానులు తమ అభిమానాన్ని పలు మార్గాల ద్వారా చూపిస్తుంటారు కూడా. ఇక తాజాగా ఒక ప్రభాస్ ఫ్యాన్ తన అభిమానాన్నివెరైటీగా చూపించాడు. దానికి కోసం తన జుట్టంతా తీసేశాడు. కేవలం ప్రభాస్ అనే అక్షరాలు మాత్రమే వచ్చేలా హెయిర్ స్టైల్ డిజైన్ చేసుకున్నాడు. ఇక ఈవిషయం తెలుసుకున్న ప్రభాస్ తనతో కాసేపు ముచ్చటించి అనంతరం అభిమానికి ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అంతేనా కాస్ట్ లీ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి అభిమానిని సర్ ప్రైడ్ చేశాడు.

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్
పలు మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యదేవ్ "బ్లఫ్ మాస్టర్"మూవీ తో హీరోగా మరారు. సక్సెస్ ఫుల్ "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం", "గాడ్సే", "స్కైలాబ్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. "రామ్ సేతు" హిందీ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం సైలెంట్ గా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ మరో సినిమాను ప్రారంభించాడు. కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది.

మాల్దీవ్స్ లో పూజాహెగ్డే ఎంజాయ్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

టాలీవుడ్ కమెడియన్స్ పార్టీ
తెలుగు ఇండస్ట్రీ లో ఉన్నంత మంది కమెడియన్స్ మరే ఇండస్ట్రీలోనూ లేరన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో ఏ ఇద్దరు టాప్ కమెడియన్లు ఒకే సినిమాలో కనిపించరు. అంత ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం అలా ఉండదు. ఒకే సినిమాలో.. 30 మంది కలిసి నటించమన్నా కూడా నటిస్తారు. అంత ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఈ కమెడియన్లంతా కలిసి ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పుతున్నారు. కలిసుంటే కలదు సుఖం అంటున్నారు.

'ఎన్టీఆర్' 21 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాత్రలు
సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అయితే వారసులు గా ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుంది కానీ వాళ్లకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయితే ఓకే కానీ అవ్వకపోతే మాత్రం ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది కష్టమే. అలాంటిది నట సార్వభౌముడు ఎన్టీఆర్ పోలీకలు పుణికి పుచ్చుకొని.. జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇవ్వాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం ఒమ్ము చేయలేదు. తాతకు తగ్గ మనవడు అనిపించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా…

'దృశ్యం 2' ట్రైలర్ రిలీజ్
మలయాళం లో సూపర్ హిట్ అయిన్ దృశ్యం మూవీ తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే దృశ్యం 2 సినిమా రాగా దాన్ని కూడా తెలుగులో రీమేక్ చేశారు. మొదటి పార్ట్ లో నటించిన విక్టరీ వెంకటేష్ ఈసినిమాలో నటించారు. ఇక ఈసినిమా రిలీజ్ పై కూడా గత కొద్దికాలంగా ఎన్నో అనుమానాలు తలెత్తిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా లేక ఓటీటీలో రిలీజ్ అవుతుందా అన్న సస్పెన్స్ అయితే ఇన్ని రోజులు కొనసాగింది. ఫైనల్ గా రీసెంట్ గానే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. గత కొన్నిరోజులుగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని మేకర్స్ రెండు రోజుల క్రితమే ఈసినిమా…

మలయాళం సినిమాలో మంచు లక్ష్మీ
బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మొదటి సినిమాతోనే ఉత్తమ విలన్‌గా నంది అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత ‘దొంగల ముఠా’, ‘చందమామ కథలు’, ‘గుండెల్లో గోదారి’, ‘దొంగాట’, ‘లక్ష్మీబాంబ్’ ఇలా పలు సినిమాలలో నటించింది. పిట్టకథలు వెబ్సిరీస్ తో డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది.

'పునీత్ రాజ్ కుమార్' కుటుంబాన్ని పరామర్శించిన బండ్ల గణేష్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కన్నడ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణించినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతిరోజూ ఎంతో మంది అభిమానులు ఆయన స్మారకాన్ని సందర్శిస్తున్నారు అంటేనే చెప్పొచ్చు పునీత్ అంటే ఎంత అభిమానమో. ఇక అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన కుటుంబాన్నిపరామర్శిస్తూ కుటుంబసభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ఇక తాజాాగా టాలీవడ్ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ కూడా బెంగుళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుంటుంబాన్ని…

'స్కైలాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, యాక్ట్రెస్ సత్యదేవ్-నిత్యమీనన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కైలాబ్. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. సత్యదేవ్- నిత్య మీనన్ ఇద్దరూ మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటారు కాబట్టి ఈనేపథ్యంలో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. 1979 సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరిగాయి అనే నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది.

'గని' టీజర్ రిలీజ్
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న సినిమా 'గని' బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా పాత్ర కోసం వరుణ్ తన ఫిట్ నెస్ విషయంలో కానీ మేకోవర్ పరంగా కానీ బాాగానే కష్టపడ్డాడు. అంతేకాదు బాక్సింగ్ లో కూడా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఇక ఈసినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నటీనటులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేశారు. ఇప్పటికే హీరోయిన్ సయీ మంజ్రేకర్, నదియా, జగపతిబాబు ఉపేంద్ర, సునీల్ శెట్టి పాత్రలకు సంబంధించి పోస్టర్ లను రిలీజ్ చేసింది. ఈ…

'అఖండ' ట్రైలర్ రిలీజ్
బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఈసినిమాతో ఇద్దరూ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ది. ఇప్పటికే వదిలిన అప్డేట్లతో అఖండ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

బిగ్ బాస్ హౌస్ ను మిస్ అవుతున్నాను నా టాప్ 5 వాళ్లే
బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఎంతో మంది కంటెస్టెంట్స్ వస్తుంటారు వెళ్తుంటారు. అయితే ప్రతి సీజన్ లో మాత్రం ఫిజికల్ టాస్కుల్లో వంద శాతం ఎఫర్ట్ పెట్టే కంటెస్టెంట్ ఒకరు ఉంటారు. అలా సీజన్ 5 లో ఫిజికల్ టాస్కుల్లో టప్ కాంపిటీషన్ ఇచ్చిన కంటెస్టెంట్ విశ్వ. ఫిజికల్ టాస్కుల్లో విశ్వ ఉంటే హౌస్ మేట్స్ అందరూ భయపడిపోయేవారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇచ్చిన ప్రతి టాస్క్ లో దాదాపు తానే విజయాన్ని దక్కించుకునేవాడు. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన విశ్వ లాస్ట్ వరకూ ఉండలేకపోయాడు. ఇక 9వ వారం ఎలిమినేషన్ లో విశ్వ బయటకు వచ్చేశాడు. ఇది ఒకరకంగా తనకే కాదు హౌస్ మేట్స్ కు కూడా షాకింగే .అయితే ఈ సీజన్‌కే సూపర్ హీరో అనిపించుకుని మరీ…

'అఖండ' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
బాలకృష్ణ-బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలు రాగా రెండు సినిమాలు హిట్ అవ్వగా ఇప్పుడు మూడో సినిమా అఖండ వస్తుండంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు వచ్చాయి. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే అఖండ నుండి గ్లింప్స్‌తో పాటు రెండు పాటలు కూడా విడుదలయ్యాయి. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

'లైగర్' కోసం రెడీ అవుతున్న మైక్ టైసన్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నఈసినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. దీనిలో భాగంగానే తాజా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్టు తెలుస్తుంది.

పూజాహెగ్డే ఫిట్ నెస్ సీక్రెట్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ "భవదీయుడు భగత్ సింగ్ " మూవీస్ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

"11:11" మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిల్మ్స్ బ్యానర్స్ పై కిట్టు నల్లూరి దర్శకత్వంలో సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి , వర్ష విశ్వనాథ్ జంటగా "11:11" మూవీ తెరకెక్కుతుంది. "11:11" మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.

'గని' ఈశ్వర్ నాథ్ గా జగపతిబాబు
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. రీసెంట్ గానే గని ప్రపంచం ఇదేనంటూ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆ వీడియోలో కీలకపాత్రలన్నీ చూపించారు. మరోవైపు ఈసినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 15న ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే తెలిపారు.