“లైగర్ ” మూవీ కై ఎదురుచూస్తున్నా -దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan Waiting for Vijay Deverakonda Liger Movie, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Dulquer Salmaan, Vijay Deverakonda, Liger Movie, Dulquer Salmaan About Liger Movie, Dulquer Salmaan says Looking Forward to Liger Movie, Liger Movie Latest News, Liger Movie Updates, Vijay Deverakonda Next Movie Details, Liger Telugu Movie, Liger, Vijay Deverakonda Latest News

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్‌ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ లో హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ దేవరకొండ శిక్షణ తీసుకున్నారు. “లైగర్ ” మూవీ తాజా షెడ్యూల్ USA లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన చిత్ర యూనిట్ అమెరికా వెళ్ళింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర దర్శకత్వం లో తెరకెక్కిన “పుష్పక విమానం” చిత్రం 12వ తేదీ థియేటర్ల లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కి విషెస్ తెలుపుతూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. .దుల్కర్ సల్మాన్ చేసిన ట్వీట్ కి విజయ్ దేవరకొండ స్పందిస్తూ నువ్వు నా సోదరుడివి అంటూ లాస్ ఏంజిల్స్ కి తాను 16 గంటల ఫ్లైట్ లో ఉన్నాను, తన టీమ్ ను వదిలి వెళ్ళను అనే కలలో నుండి మేల్కొన్నాను అని అంతేకాక “కురుప్” మూవీ కి బెస్ట్ విషెస్ తెలుపుతూ విజయ్ ట్వీట్ చేయగా , దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ”లైగర్” కోసం ఎదురు చూస్తున్నా అంటూ రీట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =