అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ మొదట్లో చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే చేసేవాడు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ ఎక్కువగానే వచ్చింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చాడు మళ్లీ ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. ఇప్పటికే అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే తన నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు ఈ యంగ్ హీరో. ‘ ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నా జీవితంలో ప్రత్యేకమైంది. నా ప్రొఫెషనల్ కెరీర్‌లోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లో నేనే చెబుతాను. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను’ అని శిరీష్ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ హాలీవుడ్ ఏమన్నా వెళుతున్నారా అంటూ అడుగగా.. దీనిపై మళ్లీ స్పందించి అలాంటి యాంబీషన్స్ ఏం లేవు బ్రో నా ఏడో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లాక్ అయింది.. ఇది తన కెరియర్లోనే బెస్ట్ స్క్రిప్ట్ అని మళ్లీ ట్వీట్ చేశాడు. మరి ఆ సినిమా ఏంటి..డైరెక్టర్ ఎవరూ లాంటి వివరాలు త్వరలో ప్రకటిస్తాడేమో చూద్దాం.
11/11/2021 will be one of the best days in my profesional life. Why, what I’ll share over the coming weeks. I’ve been off social media for a reason 🙂
— Allu Sirish (@AlluSirish) November 11, 2021
Alanti ambitions nakem le bro. #Sirish7 lock ayyindi, andariki katha nacchindi anna anandam. The best script of my career, I feel.
— Allu Sirish (@AlluSirish) November 11, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: