నటసింహా నందమూరి బాలకృష్ణ– గోపీచంద్ మలినేనితో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా.
ఇక బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే గోపీచంద్ బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NBK107 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రారంభోత్సవం నేడు హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఇక ఈసినిమా ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను మేకర్లకు అందజేశారు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది.
Our ROARING Film #NBK107 has been launched Today! 💥
Extremely thrilled & Excited to move to the sets.. with the LION, #GodOfMasses & our ‘Natasimham’ #NandamuriBalakrishna Gaaru! 🦁🔥
Will try to present #NBK Gaaru in best possible Avatar! 😊👍🏻#NBK107Begins pic.twitter.com/gNbZOqhcos
— Gopichandh Malineni (@megopichand) November 13, 2021
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: