తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్టయింది. ఈ ఒక్క సినిమాతో కార్తికేయ, పాయల్, డైరెక్టర్ అజయ్ భూపతి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతంముగ్గురు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి , తారా సుతారియా జంటగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తడప్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ , నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
ఇక తాజాాగా ఈ రీమేక్ పై స్పందించిన పాయల్ హిందీ రీమేక్ లో నటించనందుకు నిజంగా బాధగా ఉందని చెప్పింది. తారా కూడా గొప్పగా నటిస్తుందని ప్రోమోలలో ఆమె చాలా అందంగా కనిపిస్తుందని.. రీమేక్ అయినా ఆ సినిమాలో తనని తాను రిపీట్ చేసి ఉండి ఉంటే బావుండేదని అభిప్రాయపడింది. మరి పాయల్ మాత్రం ఆర్ఎక్స్ 100లో తన నటనతో సినిమాకు బలం అయింది.. చూద్దాం తారా ఏ మేరకు మెప్పిస్తుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: