రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్యాథరీన్ మరో కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.వినాయక చవితి పండగ రోజు “మాచర్ల నియోజకవర్గం” మూవీ షూటింగ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ తో ప్రారంభం అయ్యింది. అదే రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజకీయ అంశాలతో కూడిన పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న “మాచర్ల నియోజకవర్గం ” మూవీని 2022 ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరో నితిన్ ను గతంలో ఎన్నడూ చూడని యాక్షన్ రోల్ లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































